Begin typing your search above and press return to search.

వీడియో వైరల్: భార్యలతో చిందేసిన పాండ్యా బ్రదర్స్

By:  Tupaki Desk   |   20 April 2021 4:02 PM GMT
వీడియో వైరల్: భార్యలతో చిందేసిన పాండ్యా బ్రదర్స్
X
టీమిండియా క్రికెటర్లు.. ప్రస్తుతం ముంబై తరుఫున ఆడుతున్న పాండ్యా బ్రదర్స్ తాజాగా తమ భార్యలతో కలిసి చిందేసారు. చింపేసారు. ఐపీఎల్ 14వ సీజన్ లో ముంబై తరుఫున ఆడుతున్న వీరిద్దరూ టీం వరుస విజయాల నేపథ్యంలో జోష్ లో ఉన్నారు. తాజాగా హార్ధిక్, కృనాల్ పాండ్యా బ్రదర్స్ తమ భార్యలు నటాషా స్టాంకోవిక్, పంకూరీ శర్మలతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

అన్నాదమ్ములు ఒకేడ్రెస్ వేసుకోగా.. భార్యలు బ్లూ, బ్లాక్ కాంబినేషన్ లో డిఫెరెంట్ దుస్తులు వేసుకున్నారు. మంచి పాటను బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకున్న వీరిద్దరూ లయబద్దంగా డ్యాన్స్ తో దుమ్మురేపారు. దీనికి సంబంధించిన వీడియోను హార్ధిక్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాండ్యా బ్రదర్స్ డ్యాన్సులపై అభిమానులు కామెంట్ చేస్తున్నారు.