Begin typing your search above and press return to search.
ఇంతకీ ఆ వీడియో తీసింది ఎవరు!?
By: Tupaki Desk | 25 Jun 2015 9:12 AM GMTతెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇంట్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లంచం ఇస్తుండగా తీసిన వీడియోలను ఎవరు తీశారు!? ఇది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తున్న ప్రశ్న!
రేవంత్ రెడ్డి తనను సంప్రదించిన వెంటనే తాను ఏసీబీని కలిశానని, ఏసీబీ అధికారులే తన ఇంట్లో నిఘా పరికరాలను అమర్చారని స్వీఫెన్సన్ చెబుతున్నారు. ఇదే విషయంపై ఏసీబీకి ఆయన సమాచారం ఇచ్చారు కూడా. ఆయన వాంగ్మూలంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే,
ఒక్కసారి రేవంత్ రెడ్డి టేపులు బయటకు వచ్చిన రోజుకు వెళితే.. ఆ టేపులు టీవీల్లో వస్తున్న కొద్ది సేపటికే ఏసీబీ ఒక ప్రకటన చేసింది. ఆ టేపులకూ తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఆ టేపులను ఎవరో వీడియో తీశారని, వాటిని టీవీలకు ఇచ్చారని, టీవీల్లో ప్రసారం చేస్తున్నారని వివరించింది. ఆ టేపులను తీసుకుని వాటిని ఎవరు తీశారో విచారణ చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆ వీడియోను ఏసీబీ తీసిందా? లేక స్టీఫెన్సన్ ఇంట్లో వీడియోను తీసిన తర్వాత దానిన ఏసీబీకి ఇచ్చారా? ఇంతకీ ఏది నిజం అనే దానిపై సందిగ్ధం నెలకొంది.