Begin typing your search above and press return to search.
ఆన్లైన్ వీడియో గేమ్స్ పై చైనా సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 31 Aug 2021 12:10 PM ISTఆన్లైన్ వీడియో గేమ్స్ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆన్లైన్ గేమ్స్ కి అడిక్ట్ అయ్యి కనీసం తిన్నామా లేదా అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఆన్లైన్ గేమ్స్ కి అడిక్ట్ అయ్యి కొందరు లక్షల్లో సొమ్మును పోగొట్టుకుంటున్నారు. అలాగే మరికొందరు పిల్లలు తల్లిదండ్రులు ఆన్లైన్ గేమ్స్ ను ఆడద్దు అని చెప్తున్నారని ఆత్మహత్యలకి కూడా పాల్పడ్డారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఇంట్లోనే ఎక్కువగా ఉండటం తో ఆన్లైన్ గేమ్స్ కి బాగా అడిక్ట్ అయ్యారు. పిల్లలు నిత్యం వీడియో గేమ్స్ ఆడుతుంటే అది వారి మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని భావించిన ఆ దేశ ప్రభుత్వం వీడియో గేమ్స్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా 18 ఏళ్లలోపు వారు ఇకపై వారంలో కేవలం మూడు గంటలు మాత్రమే ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుకునేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నియమాన్ని అమల్లోకి తీసుకొచ్చిన దేశం చైనా. పిల్లలు ఆన్ లైన్ వీడియో గేమ్ లు ఆడటంపై చైనా కఠినమైన నిబంధనలు విధించింది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో కేవలం ఒక గంట మాత్రమే వీడియో గేమ్ లు ఆడుకోవడానికి అనుమతించింది. అది కూడా రాత్రి 8-9 గంటల మధ్యే ఆడుకోవాలి. వేరే సమయాల్లో పిల్లలు గేమ్‌లు ఆడకుండా చర్యలు తీసుకోవాలని గేమింగ్ కంపెనీలను చైనా ఆదేశించింది.
ఇదిలా ఉంటే చైనా ఇలా వీడియో గేమ్స్‌పై నిబంధనలు విధించడం ఇదే తొలిసారి కాదు 2019లో రోజుకు గంటన్నర, ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు గంటల చొప్పున ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకునే అవకాశాన్ని కలిపించింది. వీడియో గేమ్‌ల వల్ల పిల్లలు ఫోన్లకే అతుక్కుపోవడంపై ఆందోళనలు వ్యక్తం కావడంతో చైనా ఈ నిర్ణయం తీసుకొన్నది. అంతేకాకుండా గేమింగ్ కంపెనీలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు నిబంధనల అమలును పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మరి చైనా తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి గేమింగ్ కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మరి.