ఆ వైసీపీ మహిళా మంత్రిలో ఇంత మార్పు వెనకా...!

Sun May 22 2022 06:00:01 GMT+0530 (IST)

vidadala rajini news update

ఆమె మహిళా మంత్రి. జగన్ కేబినెట్ 2.0లో చోటు దక్కించుకున్నారు. అయితే.. మంత్రికంటే ముందు ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ  ఏ అవకాశం వచ్చినా.. విరుచుకుప డేవారు. తన సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలను అతి తక్కువ సమయంలోనే తన దారికి తెచ్చుకున్నారు.తనకిక తిరుగులేదు..అనే విధంగా ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యే అంటేనే.. ఒకవిధమైన చర్చవచ్చింది.ఆవిడే.. విడదల రజనీ.ఇటీవల జరిగిన జగన్ కేబినెట్ 2.0లో చోటు దక్కించుకున్నారు. అయితే. ఎమ్మె ల్యేగా ఉన్నప్పుడు..ఇప్పుడు ఆమెలో ప్రత్యేకంగా మార్పు కనిపిస్తుండడమే ఇప్పుడు చర్చకు వచ్చింది.

వాస్తవానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దూకుడు చూపించిన ఆమె.. మంత్రి అయ్యాక మరింత ఫైర్ అవుతారని అందరూ అనుకున్నారు. దీంతో రజనీకి మంత్రి పదవి ఇవ్వడంపై.. చాలా మంది పెదవి విరిచారు. అయితే.. అనూహ్యంగా ఆమె వ్యవహార శైలి మారిపోయింది.

కాదు.. కాదు.. మార్చుకున్నారు. కూర్చున్న సీటు ప్రకారం.. నడవడిక మార్చుకోవాలన్న సామెతను ఆమె ఒంటబట్టించుకున్నారు. ఇప్పుడు ఎక్కడా ఫైర్ లేదు. అంతా ఆచి తూచి మాట్లాడుతున్నారు. విపక్ష నేతపై ఒకప్పుడు విరుచుకుపడిన నోటితోనే.. ఇప్పుడు చాలా గౌరవంగా సమాధానం చెబుతున్నారు. మాటల్లో పదునున్నా.. ఫైర్ తగ్గించారు. అదేసమయంలో ఆపన్నులకు సాయం అందించడంలోనూ.. మంత్రి ముందున్నారు.

ఇటీవల కాకాని హైవేలో ఒక ప్రమాదం జరగ్గా.. మంత్రి ఆ సమయంలో అటుగుండా వెళ్తున్నారు. ఈ ప్రమాదం చూసిన.. ఆమె ప్రొటోకాల్‌ను పక్కన పెట్టిమరీ.. బాధితులను ఆదుకున్నారు. అంబులెన్స్‌కు ఫోన్ చేసి..అది వచ్చే వరకు అక్కడ వెయిట్ చేసి.. బాధితులను ఆదుకున్నారు.

ఇక నియోజకవర్గంలోనూ.. తనతో అంటీముట్టనట్టుగా ఉన్న నాయకులను ఇటీవల ఇంటికి పిలిచి మరీ.. టీ పార్టీ ఇచ్చి.. వారితో సమస్యలు చర్చించారు. ఈ పరిణామాల చూస్తే.. మంత్రి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.