Begin typing your search above and press return to search.

పోలీసులపై నమ్మకం లేదు.. రాజు మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావాలి: బాలిక తండ్రి

By:  Tupaki Desk   |   16 Sep 2021 2:32 PM GMT
పోలీసులపై నమ్మకం లేదు.. రాజు మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావాలి: బాలిక తండ్రి
X
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ రేపిస్ట్ చివరకు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకొని కుక్కచావు చచ్చాడు. ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన ఈ క్రూరుడు కోసం పోలీసులు జల్లెడ పడుతున్న వేళ రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు.

సైదాబాద్ నిందితుడిపై ఇటు సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. విషయం పెద్దది అవ్వడంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకొని రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10లక్షల బహుమానం ప్రకటించారు.

ఈరోజు రాజు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకొని కనిపించడంతో ఈ ఘటన ముగిసినట్టైంది. చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉండడంతో ఇతడిని రాజుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. రాజు చనిపోయినట్టు వార్తలు రావడం చూసి చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా నిందితుడు రాజు ఆత్మహత్య ఘటనపై బాధిత బాలిక తండ్రి మాత్రం భిన్నంగా స్పందించారు. 'పోలీసులపై తమకు నమ్మకం లేదని' తేల్చిచెప్పాడు. నిందితుడు చనిపోయాడంటే తాము నమ్మబోమని అన్నారు. మృతదేహాన్ని ఒక్కడకు తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు. చనిపోయింది రాజేనా? కాదా? అన్న విషయాన్ని తాము గుర్తిస్తామని చెప్పారు.

తమ బిడ్డను చేతుల్లో నుంచి లాక్కుపోయారు కదా.. అప్పుడు అతడు డెడ్ బాడీని తీసుకురావాల్సిందేనని బాధిత బాలిక తండ్రి డిమాండ్ చేశారు. అతడు బతికుంటే చంపేస్తామన్న భయం ఉండొచ్చేమో.. కానీ ఇప్పుడు చనిపోయాడు కదా తీసుకురావడానికేంటి? అంటూ ప్రశ్నించాడు.

రాజు చనిపోయాడన్న వార్తలపై తమకు ఎన్నో అనుమానాలున్నాయని బాలిక తండ్ిర అన్నారు. మృతదేహాన్ని చూస్తేనే నమ్ముతామన్నారు. ఆ రోజు రాజు గది తలుపులను పగులగొట్టామని.. మేం 7 గంటలకు డిమాండ్ చేస్తే 12 గంటలకు పగులగొట్టారని.. అలాంటి పోలీసుల మాటలను తామెలా నమ్ముతామని ఆయన ప్రశ్నించారు.