Begin typing your search above and press return to search.

వెంకయ్య నీతులు బాగానే చెబుతున్నారే ?

By:  Tupaki Desk   |   19 April 2022 8:30 AM GMT
వెంకయ్య నీతులు బాగానే చెబుతున్నారే ?
X
ఆచరణ సాధ్యంకాని హామీలపై చర్చ అవసరం..ఇది తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు. వెంకయ్య చేసిన వ్యాఖ్యలపై జనాల్లో మిశ్రమస్పందన వినిపిస్తోంది. కుల, మత, ప్రాంతీయతత్వాలు దేశానికి చాలా ప్రమాదకరమని వెంకయ్య ఆందోళన వ్యక్తంచేయటమే ఆశ్చర్యంగా ఉంది. వెంకయ్య క్రియాశీల రాజకీయాల్లో ఉన్నంతవరకు ఇలాంటి మాటలు మాట్లాడినట్లులేదు.

ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి అయ్యారో ఎప్పుడైతే ఏపీ పర్యటనకు వస్తారో అప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు జనాలు మండుతున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇస్తున్నాయి.

ఆ రాష్ట్రాలకు వెళ్ళి వెంకయ్య ఇవే మాటలు ఎందుకు చెప్పటంలేదు ? ఇక కుట, మత ప్రాంతీయ తత్వాలు దేశానికి చాలా ప్రమాదకరమని చెప్పటం విచిత్రమే. ఎందుకంటే బీజేపీ ఎదుగుదలే మతతత్వం మీద ఆధారపడుందన్నది అందరికీ తెలుసు.

కొన్ని రాష్ట్రాల్లో కానీ లేదా కేంద్రంలో కానీ బీజేపీ అధికారంలో ఉందంటే అందుకు మతమే కారణం. సమాజాన్ని మతపరంగా చీల్చిన తర్వాత బీజేపీకి ఆదరణ వచ్చింది. దశాబ్దాల పాటు కేవలం 2 లోక్ సభ స్ధానాలకే పరిమితమైన పార్టీ ఇపుడు అధికారంలోకి వచ్చిందంటే కేవలం మతపరమైన రాజకీయాలు చేయటం వల్లే. పార్టీ మతపరమైన రాజకీయాలు చేస్తున్నపుడు ఇదే వెంకయ్య పార్టీ జాతీయ అధ్యక్షునిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. అప్పుడెప్పుడు మతపరమైన దోరణి దేశానికి ప్రమాదకరమని చెప్పలేదు.

కుల, మత, ప్రాంతీయ తత్వాలు సమాజాభివృద్ధికి నిజంగా అవరోధాలన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తాము లబ్ది పడేవరకు వాటిని పూర్తిగా ఆచరించి ఇపుడు మాత్రం వెంకయ్య నీతులు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అసలివే మాటలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్ళి వెంకయ్య ఎందుకు చెప్పటంలేదు.

కేంద్రం కూడా ఆచరణసాధ్యంకాని ఎన్నో మాటలు చెబుతోంది. 2014 ఎన్నికల్లో స్విట్జర్లాండ్ నుండి బ్లాక్ మనీ మొత్తం తెప్పిస్తానని ఇచ్చిన హామీ ఏమైందో ఎవరికీ తెలీదు. ఆ విషయంపైన వెంకయ్య డైరెక్టుగా కేంద్రాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది.