Begin typing your search above and press return to search.

అవును.. అఫ్గాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడ్ని నేనే

By:  Tupaki Desk   |   18 Aug 2021 4:30 AM GMT
అవును.. అఫ్గాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడ్ని నేనే
X
అఫ్గానిస్థాన్ లో అనూహ్యంగా చోటు చేసుకున్న మార్పుల గురించి తెలిసిందే. అమెరికా.. నాటో సేనలు అఫ్గాన్ ను విడిచి వెళ్లిపోతున్న వేళ.. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవటం తెలిసిందే. ఈ ప్రక్రియ మరికొన్ని నెలల పాటు సాగుతుందంటే.. కేవలం వారం వ్యవధిలోనే పూర్తి కావటం.. ఇప్పుడు అఫ్గాన్ వారి వశం కావటం తెలిసిందే. దీంతో.. కొత్త భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అఫ్గాన్లు పెద్ద ఎత్తున దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో.. కాబూల్ విమానాశ్రయంలోని పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

మరోవైపు దేశానికి అండగా నిలుస్తామని.. తాలిబన్లను నిలువరిస్తామని గొప్పలు చెప్పిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. చెప్పా పెట్టకుండా పెద్ద ఎత్తున డబ్బు సంచులతో దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవటం.. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడన్న విషయం మీదా క్లారిటీ లేని విషయంతెలిసిందే. ఇదిలా ఉండగా.. తాలిబన్లు కాబూల్ ను ఆక్రమించుకోవటంతో అఫ్గాన్ మొత్తం వారి వశమైంది.

అఫ్గాన్ రాజ్యాంగం ప్రాకకరం అధ్యక్షుల వారు దేశాన్ని విడిచిన సందర్భంలో ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించటం జరుగుతుంది. దీంతో.. తాను అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టనున్నట్లుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌. ఓపక్క తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్న తర్వాత.. పార్లమెంటులో దర్జాగా కూర్చున్న తాలిబన్ సైనికుల వీడియోలు చక్కర్లు కొడుతుంటే.. అమ్రుల్లా మాత్రం తనను తాను దేశ అధ్యక్షుడ్ని అని ప్రకటించటం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుల వారు పలాయనం చిత్తగించిన వేళ. .తాలిబన్లను ఎదుర్కొవాల్సింది పోయి చేతులు ఎత్తేసినట్లుగా ఉన్న ఆయన.. ఇప్పుడు తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం తాను దేశంలోనే ఉన్నానని.. త్వరలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తానని వారిని కలుస్తానని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై తాలిబన్లస్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడేం జరుగుతుందో చూడాలి