Begin typing your search above and press return to search.

వయాగ్రా.. కరోనాకు మందు ? నా ప్రాణాలు కాపాడింది..

By:  Tupaki Desk   |   4 Jan 2022 9:30 AM GMT
వయాగ్రా.. కరోనాకు మందు ? నా ప్రాణాలు కాపాడింది..
X
ప్రపంచాన్ని మరోసారి కరోనా గడగడలాడిస్తోంది. చాలా దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో మరణాలు కూడా అధికంగానే ఉంటున్నాయి. అయితే కరోనా బారిన పడిన ఓ నర్సు చావు అంచుల్లోకి వెళ్లి తిరిగి ప్రాణం పోసుకుంది. ఇక మరణం తప్పదనుకుంటున్న తరుణంలో వైద్యులు ఓ ప్రయోగం చేశారు. పురుషుల అంగస్తంభనం కోసం వాడే వయగ్రాను ఆమె చికిత్సకు వాడారు. దీంతో ఆ మహిళ కరోనా నుంచి కోలుకుంది. దీంతో వైద్యలు హర్షం వ్యక్తం చేస్తున్నరు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. దీంతో కరోనాకు వయగ్రా మందు నా..? అని అనుకుంటున్నారు.

బ్రిటన్లోని లింకన్ షైర్ కు చెందన మోనికా అల్మెడా అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. గతేడాది నవంబర్ 6న ఆమె కరోనా బారిన పడింది. తీవ్ర అస్వస్థత కావడంతో 9న ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమె పరిస్థితి రోజురోజుకు దిగజారడంతో వైద్యులు ఆమెను ఐసీయూకు తరలించారు. ఆ తరువాత వైద్య చికిత్స చేస్తుండగా అల్మెడా కోమాల్లోకి వెళ్లింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె కోలుకునే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఇక వెంటిలేటర్లు తీసేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు.

కానీ చివరి ప్రయత్నంగా వైద్యులు ఓ ప్రయోగం చేశారు. ఆమెకు పెద్ద మొత్తంలో వయగ్రాను అందించారు. దీంతో ఆమె ఊపిరితిత్తులు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో శరీరానికి పెద్ద మొత్తంలో రక్తప్రసరణ సాగింది. ఇలా కేవలం 48 గంటల్లోనే ఆమె పరిస్థితి మెరుగుపడింది. డిసెంబర్ 14న స్ప్రుహలోకి వచ్చిన మోనికా పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన ఆమె తన స్టోరీ చెప్పడంతో ఆ విషయం ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది.

వాస్తవానికి వయగ్రాను అంగస్తంభనం కోసం వాడుతారు. కొందరు పురుషులు దీనిని తీసుకోవడం వల్ల వారిలో వస్తుంది. ఈ క్రమంలో రక్త ప్రసరణ ఎక్కువై వారి బాడి ఫిట్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో వయగ్రాను నర్సు శరీంలోకి ఎక్కించారు. దీంతో ఆమెలో రక్త ప్రసరణ ప్రారంభం కావడంతో ఫలితాన్నిచ్చింది. అయితే ఇది అందిరిలోనూ సాధ్యమవుతుందా..? అనేది చెప్పలేమంటున్నారు. కానీ దీనిపై వైద్యులు పరిశోధనుల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇప్పుడున్న వేరియంట్ ను దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్లు, మెడిసిన్ వస్తున్నాయి. ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ వేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఇలాంటి చికిత్సలు చేసే అవకాశం ఉందా..? అని చర్చించుకుంటున్నారు. అయితే కరోనా నుంచి బయటపడేందుకు ముందు చర్యగా జాగ్రత్తలే అని అంటున్నారు. జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు.