Begin typing your search above and press return to search.

నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు: వీహెచ్ ఆవేదన

By:  Tupaki Desk   |   21 Jun 2021 3:32 PM GMT
నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు: వీహెచ్ ఆవేదన
X
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి బయటపడ్డాడు. కాంగ్రెస్ లోని పరిస్థితులపై విరుచుకుపడ్డారు. 'మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని' వీహెచ్ ఆవేదన చెందారు.

'కోర్ కమిటీ సమావేశం లేదు. ఎలాంటి చర్చా లేదు. కర్ణాటకలోని పీసీసీ అంశం వివాదం అయితే పరిశీలకుడిగా మధుసూదన్ మిస్త్రీని పంపించారు. ఇక్కడ మాణిక్యం టాగూర్ తీసుకున్న నిర్ణయమే ఫైనలా?' అని వీహెచ్ పార్టీలోని విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈరోజు తెలంగాణలో ఉత్తమ్, భట్టి వల్లే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చిందని వీహెచ్ ఆరోపించారు. 'నేను కాంగ్రెస్ మనిషిని.. నేను ఫోన్లు చేస్తే కూడా లిఫ్ట్ చేయడు. ఫోన్లు కొందరికే చేసి నిర్ణయిస్తారా? ఇంత సీనియర్ అయినా నాకు ఫోన్ రాలేదు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నా.. సమీక్ష చేసే నాయకుడే లేరు' అని వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు.

పీసీసీ అధ్యక్షుడి విషయంలో పరిశీలకుడు వచ్చి వెళ్లాకే ప్రకటన చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ను వీహెచ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి పీసీసీ నిర్ణయిస్తే పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియని పరిస్థితి అని వీహెచ్ పేర్కొన్నారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే పార్టీ పరిస్థితి ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.