Begin typing your search above and press return to search.

వేడెక్కిన వెంక‌ట‌గిరి పాలిటిక్స్‌.. రీజ‌న్ ఇదే గురూ!!

By:  Tupaki Desk   |   18 Jan 2023 9:30 AM GMT
వేడెక్కిన వెంక‌ట‌గిరి పాలిటిక్స్‌.. రీజ‌న్ ఇదే గురూ!!
X
ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు 120 డిగ్రీల వేడిలో స‌ల‌స‌ల మ‌రుగుతు న్నాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని విధంగా ఇక్క‌డి రాజ‌కీయం మారిపోయింది. దీనికి కార‌ణం వైసీపీ అధిష్టానం తాజాగా తీసుకున్న నిర్ణ‌య‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ నుంచి గ‌త 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వైసీపీ నాయ‌కుడు ఆనం రామ‌నారాయ‌ణరెడ్డిని ఇంచార్జ్ ప‌ద‌వి నుంచి వైసీపీ తొల‌గించింది.

దీంతో ఆయ‌న తాజాగా 'ఇక‌, ఇమ‌డ‌లేను' అని త‌న వారితో చెప్పేశారు. దీంతో వైసీపీ కేడ‌ర్‌గా ఉన్న ఆనం వ‌ర్గం ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా వెళ్లిపోదామ‌ని.. ఆయ‌న‌తోనే క‌లిసి అడుగులు వేస్తామ‌ని తేట‌తెల్లం చేశాయి. ఇది స్థానికంగా వైసీపీకి బిగ్ షాక్ ఇస్తోంది. ఎందుకంటే.. వాస్త‌వానికి వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌. కురుగుండ్ల రామ‌కృష్ణ ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు.

దూకుడు నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. గ‌త వైసీపీ హ‌వాలో ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ శ్రేణులుగా ఉన్న వారు.. పార్టీకి రాం రాం చెబితే.. ఆనం వెంట వెళ్లిపోతే.. ఇక్క‌డ నుంచి టికెట్ ఇస్తార‌ని భావిస్తున్న నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్ త‌న‌యుడు రామ్‌కుమార్‌కు జెండా మోసేవారు.. జై కొట్టే వారు కూడా ఉండ‌కుండా పోతారు. దీంతో ఆనం ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ఆయ‌న అలెర్ట్ అయ్యారు.

వైసీపీ నుంచి ఒక్క నేత కూడా బ‌య‌ట‌కు వెళ్ల‌ర‌ని ఆయ‌న తాజాగా వ్యాఖ్యానించారు. కానీ, ఆనం వ‌ర్గాన్ని త‌న‌దైన శైలిలో తిప్పుకోనే వ్యూహం మాత్రం రామ్‌కుమార్‌కు లేదు. ఎందుకంటే.. మాజీ సీఎం కుమారుడి గా ఆయ‌న‌కు పేరున్నా..

ప్ర‌జ‌ల్లో ఏనాడూ లేరు. వ్యాపారాలు, వ్య‌వ‌హారాల వ‌ర‌కు ప‌రిమితం అయ్యారు. ఇక‌, వైసీపీ రాజ‌కీయాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న టీడీపీ నాయ‌కుడు రామ‌కృష్ణ‌.. త‌నకు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో వెంక‌ట‌గిరి వైసీపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.