Begin typing your search above and press return to search.

స‌మాజానికి అదొక శాప‌మంటున్న వెంక‌య్య

By:  Tupaki Desk   |   25 Nov 2018 12:17 PM IST
స‌మాజానికి అదొక శాప‌మంటున్న వెంక‌య్య
X
మ‌న‌దేశంలో సామాజిక వివ‌క్ష‌ను రూపుమాపాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఉప రాష్ట్రప‌తి వెంకయ్య‌నాయుడు నొక్కిచెప్పారు. కులం అనేది స‌మాజానికి ఓ శాపంలా మారిందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న ప్ర‌జా జీవితంలో కులానికి సంబంధించి ఎన్నోసార్లు అభ్యంత‌రక‌ర మాట‌లు విన్నాన‌ని వెల్ల‌డించారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో శ‌నివారం డాక్ట‌ర్ నాగేంద్ర సింగ్ ఇంటర్నేష‌న‌ల్ పీస్ అవార్డు ప్ర‌దానోత్స‌వంలో వెంక‌య్య‌నాయుడు పాల్గొన్నారు. స‌మాజ అభ్యున్న‌తికి నిరంత‌రం పాటుప‌డుతున్న చిన్మ‌య మిష‌న్‌కు ఈ అవార్డు ద‌క్కింది. వెంక‌య్యనాయుడు చేతుల మీదుగా చిన్మ‌య మిష‌న్ దిల్లీ విభాగం నిర్వాహ‌కులు స్వామి ప్ర‌క‌ర్షానంద అవార్డును స్వీక‌రించారు.

అవార్డు ప్ర‌దానోత్స‌వంలో వెంక‌య్య‌నాయుడు ప్ర‌సంగించారు. దేశంలో సామాజికప‌ర‌మైన - లింగ‌ప‌ర‌మైన వివ‌క్ష‌ల‌ను పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. కులాన్ని స‌మాజానికి ఓ శాపంగా అభివ‌ర్ణించారు. ఇన్నేళ్ల‌ ప్ర‌జా జీవితంలో చాలాసార్లు కుల వివ‌క్ష‌కు సంబంధించిన మాట‌లు వినాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ఆ మాట‌లు విన్న ప్ర‌తిసారీ త‌న గుండె త‌రుక్కుపోయేద‌ని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌టం - సార్వ‌త్రిక ఎన్నిక‌లకు స‌మ‌యం స‌మీపిస్తుండ‌టంతో దేశ ప్ర‌జ‌ల‌కు ఉప రాష్ట్రప‌తి సుతిమెత్త‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. రాజ‌కీయాలు, కులం ఏక‌మైతే ప్ర‌మాద‌మ‌ని సూచించారు. అభ్య‌ర్థుల క్యార‌క్ట‌ర్‌, ద‌క్ష‌త‌, సామ‌ర్థ్యం, స‌త్ప్ర‌వ‌ర్త‌న‌ను చూసే వారిని ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎన్నుకోవాల‌ని సూచించారు. అయితే - కొన్నిసార్లు ఎన్నిక‌ల్లో కులం, డ‌బ్బు, నేర చ‌రిత్ర‌, సామాజిక‌వ‌ర్గ‌మే ఎక్కువ ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు