Begin typing your search above and press return to search.
గాంధీ మనవడితో వెంకయ్య పోటీ..ఇవే విశేషాలు
By: Tupaki Desk | 18 July 2017 4:03 PM ISTఉప రాష్ర్టపతి పదవి కోసం అధికార పక్షం - విపక్షాల నుంచి ఉమ్మడిగా పోటీ నెలకొంది. ఎన్డీఏ అభ్యర్థిగా ఎం. వెంకయ్యనాయుడు - విపక్షాల అభ్యర్థిగా జాతిపిత మహాత్మగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ బరిలో ఉన్నారు. వీరిద్దరూ మంగళవారం ఉదయం నామినేషన్లు దాఖలు చేశారు. ఆగస్టు 5న ఉపరాష్ర్టపతి ఎన్నికలు జరగనున్నాయి. ఉపరాష్ర్టపతిగా ఎన్నికైన వారు రాజ్యసభకు చైర్మన్ గా ప్రాతినిధ్యం వహిస్తారు.
తాజా ఎన్నికల నేపథ్యంలో వెంకయ్య - గోపాలకృష్ణ ప్రొఫైల్స్ ను పరిశీలిస్తే..
వెంకయ్యనాయుడు.. 1 జులై - 1949లో ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్ లో పాఠశాల విద్య చదివారు. వీఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. వెంకయ్య కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో చేరారు. 1972లో జరిగిన జై ఆంధ్రా ఉద్యమం ద్వారా వెంకయ్య వెలుగులోకి వచ్చారు. 1974లో జయప్రకాశ్ నారాయణ్ ఛాత్ర సంఘర్షణ్ సమితి కన్వీనర్ పదవి చేపట్టి నెల్లూరులో ఉద్యమం నడిపారు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి జైలుశిక్షను అనుభవించారు. 1977-80 మధ్యకాలంలో బీజేపీ యువజన విభాగం అధ్యక్ష పదవి చేపట్టారు. పట్టణాభివృద్ధి శాఖ - పార్లమెంటరీ వ్యవహారాల శాఖ - సమాచార శాఖ మంత్రిగా మోడీ కేబినెట్ లో వెంకయ్య పని చేశారు. అటల్ బీహారి వాజ్ పేయి కేబినెట్ లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, రెండు సార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయిన గోపాలకృష్ణ గాంధీ.. 22 ఏప్రిల్ - 1946న ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఇంగ్లీష్ లిటరేచర్ లో పోస్టు గ్రాడ్యుయేట్ చేశారు. 1968లో సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన గాంధీ.. తొలిసారిగా తమిళనాడు రాష్ర్టంలో ఐఏఎస్ గా పని చేశారు. ఆ తర్వాత ఉప రాష్ర్టపతికి సెక్రటరీగా - రాష్ర్టపతికి జాయింట్ సెక్రటరీగా సేవలందించారు. భారత హైకమిషనర్ గా దక్షిణాఫ్రికా - లిసోతోలో సేవలందించారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా 2004-09 మధ్య కాలంలో పని చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ మరియు కళాక్షేత్ర ఫౌండేషన్ కు ఛైర్మన్ గా పని చేశారు.