Begin typing your search above and press return to search.

సోనియాను ప్ర‌శంసించిన వెంక‌య్య‌నాయుడు

By:  Tupaki Desk   |   22 May 2016 4:48 PM IST
సోనియాను ప్ర‌శంసించిన వెంక‌య్య‌నాయుడు
X
కాంగ్రెస్ పార్టీ అంటేనే దూకుడుగా విమ‌ర్శించే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అనూహ్యంగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ప్ర‌శంసించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రానున్నారంటూ సర్వత్రా ఊహానాగాలు వెలువడుతున్న నేపథ్యంలో వెంక‌య్య సోనియాగాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాహుల్ పదోన్నతిపై - సోనియా వ్య‌క్తిత్వంపై వెంక‌య్య స్పందించారు.

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు అన్నది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిపై తాను పెద్దగా మాట్లాడదలచుకోలేదని వెంక‌య్య‌నాయుడు పేర్కొన్నారు. సోనియాగాంధీ వల్ల‌నే కాంగ్రెస్ ఇప్పటికీ సంఘటితంగా ఉందన్నారు. ఆమే లేకుంటే కాంగ్రెస్ పతనమైపోయి ఉండేదని వెంకయ్య అన్నారు. అయితే వంశపారంపర్య రాజకీయాలకు తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో వంశపారంపర్యంగా నాయకత్వం అన్నది దుష్ట సంప్రదాయమైనప్పటికీ కొందరి అది చాలా ఇష్టంగా ఉంటుందని వెంకయ్యనాయుడు అన్నారు. అయినప్పటికీ వాస్తవాలను అంగీకరించి తీరాలని పేర్కొన్నారు.