Begin typing your search above and press return to search.
ఉపరాష్ట్రపతి పదవి వద్దని వెంకయ్య ఇందుకే అన్నారా?
By: Tupaki Desk | 25 Dec 2019 7:00 AM ISTబీజేపీ నేతగా - కేంద్ర మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు పని చేయడంతో పాటు బీజేపీలో కీలక నేతగా ఎదిగిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు... ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడెప్పుడో కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన... తనకు రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి పదవులు దక్కనున్నాయన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆ పదవులు తనకు సూట్ కావని - తాను రాష్ట్రపతిగా ఉండటం కంటే తన భార్యకు పతిగా ఉండేందుకే ఇష్టపడతానంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నిజంగానే నాడు సంచలనంగా మారిపోయాయి. అయినా భారత ప్రథమ పౌరుడో - ద్వితీయ పౌరుడిగానో పదవి దక్కుతుందంటే... ఎగిరి గంతేసి మరీ ఆ పదవిని చేపట్టడం మానేసి... ఆ పదవులు తనకు వద్దంటూ వెంకయ్య ఎందుకు చెప్పారన్న విషయం ఇప్పటికి గానీ జనానికి బోధపడలేదన్న వాదన వినిపిస్తోంది.
రాష్ట్రపతి - లేదంటే ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చునే ఏ నేత అయినా... యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోక తప్పదు. మరి ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన వెంకయ్య కూడా అదే పనిచేయక తప్పలేదు. ఉప రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వెంకయ్య కూడా యాక్టివ్ పాలిటిక్స్ కు స్వస్తి చెప్పక తప్పలేదు. ఈ నేఫథ్యంలో ఏ కీలక అంశం ప్రస్తావనకు వచ్చినా... తన మనసులోని మాటను నిర్భయంగా బయటపెట్టడం ఇప్పుడు వెంకయ్యకు సాధ్యం కావడం లేదు. ఈ తరహా విచిత్ర పరిస్థితి మంగళవారం ఏపీ ప్రజలకు అనుభవంలోకి వచ్చిందని చెప్పాలి. ఏపీ నిట్ తొలి స్నాతకోత్సవానికి వచ్చిన వెంకయ్యను రాజధాని అమరావతి రైతులు కలిశారు. ఈ సందర్బంగా జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో తమ బతుకులు నాశనమవుతున్నాయని వారు ఆయన ముందు ఏకరువు పెట్టారు. తమను రక్షించాలని కూడా వారు ఆయనను కోరారు.
ఈ సందర్భంగా రాజధాని రైతులు ఎంతగా మొర పెట్టుకున్నా... వారికి అనుకూలంగా ఒక్కటంటే ఒక్ర మాట కూడా మాట్లాడలేని వెంకయ్య... తన అశక్తతను మాత్రం బయటపెట్టారు. ‘‘ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను. ప్రభుత్వంలో లేను. బహిరంగంగా మాట్లాడటానికి లేదు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. ఏదైనా వినతి పత్రం ఇవ్వదలచుకుంటే ఇవ్వండి. దానిని సంబంధింత వ్యక్తులకు అందజేస్తాను. అంతకుమించి తన నుంచి ఏమీ ఆశించవద్దు’’ అంటూ వెంకయ్య చెప్పేసరికి రైతులంతా షాక్ తిన్నారు. నిజమే మరి... ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వెంకయ్య ఏమీ చేయలేరు కదా. అదే విషయాన్ని వెంకయ్యే స్వయంగా చెప్పడంతో రాజదాని రైతులు కూడా ఓ వినతి పత్రాన్ని ఆయనకు సమర్పించి వెనుదిరిగారు. అంటే... ఉపరాష్ట్రపతి పదవి వెంకయ్య కాళ్లు చేతులు కట్టేసిందన్న మాట.