Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ తో పొత్తా... వెంకయ్య ఆశ్చర్యం
By: Tupaki Desk | 24 Aug 2018 11:08 AM ISTతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కాంగ్రెస్ తో పొత్తు ఆలోచనకు అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సొంత పార్టీకి చెందిన వారు ఏకంగా పార్టీని వీడతామని అంటూంటే ఇతర పార్టీలకు చెందిన వారు కూడా ఈ నిర్ణయం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా కాంగ్రెస్ తో పొత్తు నిర్ణయం విస్మయం వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి. విజయవాడలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ కలుస్తుదన్న వార్తలపై ఒకింత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేేసినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్. టి. రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేశారని, అలాంటిది ఇప్పుడు ఏవో ప్రయోజనాల కోసం వారితో చేతులు కలపాలనుకోవడం దారుణమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారట ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తాను కాంగ్రెస్ పార్టీకి బద్ద వ్యతిరేకిననే విషయం తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్.టి.రామారావుకు తెలుసని, అందకే 1983 సంవత్సరంలో తాను పోటీ చేస్తే తనను ఓడించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. ఆ ఎన్నికల్లో తాను ఓడిపోకూడదని ఎన్.టి.రామారావు కోరుకున్నారని, అందుకే అక్కడ ఆయన ప్రచారం చేయాల్సి ఉన్నా రాలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. ఆ ఎన్నికల సమయంలో తాను ప్రచారానికి రానని - మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నానంటూ దగ్గుబాటి చెంచురామయ్యను తన వద్దకు ఎన్.టి.రామారావు పంపించారని ఆయన చెప్పారు. అంతటి కాంగ్రెస్ వ్యతిరేకత తెలుగుదేశంలో ఉందని ఆయన అన్నారు.
అయితే, ఇప్పుడు ఏవో రాజకీయ కారణాలతో కాంగ్రెస్ పార్టీతో కలిస్తే మహానుభావుడు ఎన్.టి.రామారావు ఆత్మ క్షోభిస్తుందన్న అభిప్రాయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిలో పలువురు ఉందని చర్చించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీతో పలుమార్లు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడానికి, వారితో కలిసి పని చేయడానికి ఈ రెండు పార్టీల మధ్య ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అప్పట్లో కీలక పాత్ర పోషించారు. అలాగే నాదెండ్ల భాస్కరరావు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును గద్దె దించినప్పుడు వెంకయ్య నాయుడు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో రాష్ట్రంలో పెద్ద ఉద్యమమే చేపట్టారు. ఎన్.టి.రామారావుతోనూ, తెలుగుదేశం పార్టీతోనూ వెంకయ్య నాయుడికి అంత అనుబంధం ఉందని పలువురు గుర్తు చేస్తున్నారు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా అని వారంటున్నారు. అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడి వ్యక్తిగత కారణాలు, అధికారం కోసం ఆ పార్టీతో చేతులు కలపాలనుకోవడం చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని వారంటున్నారు.