Begin typing your search above and press return to search.
వెంకయ్య జిహ్వచాపల్యానికి కత్తెర!
By: Tupaki Desk | 25 July 2017 6:00 AM ISTకేంద్ర కేబినెట్ నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి ప్రవేశించిన నెల్లూరు బిడ్డ ముప్పవరపు వెంకయ్యనాయుడుకు చాలా పెద్ద చిక్కే వచ్చి పడింది. ఈ ఎన్నికలో నెగ్గడం ద్వారా ఆయనకు చాలా పెద్ద నష్టం వాటిల్లబోతోంది! నష్టం అనగానే మీరు రకరకాల ఊహాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు! రాజ్యాంగబద్ధమైన ఉన్నతపదవిలోకి వెళ్తుడడం వలన ఆయన జిహ్వచాపల్యానికి కత్తెర పడబోతోంది. సహజంగా తన మూలాలు మరచిపోకుండా, దాటివచ్చిన చిన్న స్థాయులను విస్మరించకుండా, కిందిస్థాయి వరకూ అందరితోనూ కలివిడిగా ఉండే వెంకయ్య నాయుడు భోజన ప్రియుడు కూడా! అలాగని ఏదో ఫైవ్ స్టార్ రుచులు - ఇటాలియన్ డిషెస్ కోరుకునే రకం కాదు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన తనకు నచ్చిన చిరుతిళ్లు కనిపిస్తే కేంద్రమంత్రిని అనే సంగతి కూడా మరచిపోయి.. రోడ్డు పక్కన కారు ఆపి - దిగి నిల్చుని ఎంచక్కా చేతిలో పేపర్ ప్లేట్ లో పెట్టించుకుని తినేస్తారు.
పాపం.. ఇప్పుడు ఆయన అలాంటి రకరకాల తనకు ఇష్టమైన రుచులను కోల్పోతున్నారు. ఆ విషయాన్ని స్వయంగా వెంకయ్యనాయుడే మీడియా మిత్రులతో పంచుకున్నారు. తనకు సహజంగా స్వేచ్ఛగా ఉండడం అలవాటు అని.. దారిలో వెళ్తూ వెళ్తూ పార్టీ కార్యకర్తలు - నాయకులు మిత్రుల ఇళ్లకు వెళ్లే సందర్భాలు ఎన్నో ఉండేవి అని ఆయన చెప్పుకున్నారు. నాకు ఇష్టమైన భోజనాలు ఏ రెస్టారెంట్ లో దొరికితే, దాని ముందు నిలబడి తినేయడమే. నేషనల్ హైవే లో వెళుతున్నా సరే.. శెట్టెమ్బ గారి దోసెలు - మదనపల్లెలో రంగన్న దోసె - చిత్తూరులో రామూ పాయ - నెల్లూరులో పులిపొంగళాలు - విజయవాడలో పునుగులు ఇలా ఎక్కడ ఏది నచ్చితే అది తినేయడమే ఆయన తీరు. ఎంతో వైవిధ్యంగా ఉండే రకరకాల లోకల్ రుచులంటే ఆయనకు అంత ఇష్టం మరి!
ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవిలోకి వెళితే.. ప్రొటోకాల్ పేరిట పైన చెప్పుకున్న స్వేచ్ఛను మొత్తం కోల్పోతానేమో అని ఆయన విచారిస్తున్నారు. నిజమే లాగుంది. ఉపరాష్ట్రపతి అయితే ఆయన ఈ నాలుక కట్టేసుకుని బతకాల్సి వచ్చేలా ఉంది. శెట్టెమ్మగారి దోసెలు - రామూ పాయ అన్నీ.. ఆయనకు జ్ఞాపకాలుగా మారిపోతాయి. ఇది కొద్దిగా ఉద్వేగాన్ని కలిగించే పాయింటే కదా!