Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి మెట్రోకు తొలి అడుగు

By:  Tupaki Desk   |   18 Sep 2015 4:54 AM GMT
అమ‌రావ‌తి మెట్రోకు తొలి అడుగు
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మెట్రోకు తొలి అడుగు స‌క్సెస్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం ప్ర‌భుత్వం సుముఖంగా ఉన్న‌ట్టు కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంక‌య్య‌నాయుడు గురువారం తెలిపారు. ఇటీవ‌ల రాష్ర్ట ప్ర‌భుత్వం అమ‌రావ‌తి మెట్రో ఏర్పాటుకు శ్రీధ‌ర‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిపాద‌న‌లు కూడా రెఢీ చేసిన సంగ‌తి తెలిసిందే. మెట్రో నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని వెంక‌య్య చెప్పారు.

మొత్తం 25 కిలోమీట‌ర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు కేంద్రం స‌హ‌క‌రిస్తుంద‌న్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ రాష్ర్ట ప్ర‌భుత్వం కేంద్రానికి పంపిస్తే కేంద్రం ప‌రిశీలిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. మెట్రోకి సంబంధించిన డీపీఆర్ ను కూడా కేంద్రానికి అందించాలని వెంకయ్యనాయుడు సూచించారు. 2018 నాటికి విజయవాడలో మెట్రో తొలిదశ పనులు పూర్తి చేయాలనుకుంటున్న‌ట్టు ఏపీ సీఎం చంద్ర‌బాబు గురువారం మీడియాతో చెప్ప‌డంతో మెట్రో రైల్ ఏర్పాటుపై కేంద్రం నుంచి కూడా రాష్ర్టానికి సంకేతాలు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ మెట్రో రైల్ నిర్మాణాన్నిరాష్ర్ట ప్ర‌భుత్వం ఢిల్లీ మెట్రో కార్పొరేష‌న్‌కు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే.

తొలి ద‌శ‌లో కేవ‌లం 25 కిలోమీట‌ర్ల మేర మాత్ర‌మే మెట్రో లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుంద‌ని వెంక‌య్యనాయుడు తెలిపారు. నిన్న‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి మెట్రోకు కేంద్రం మొండిచేయి చూపిస్తుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌తో నిరాశ‌తో ఉన్న రాష్ర్ట ప్ర‌భుత్వానికి, రాజ‌ధాని ప్ర‌జ‌ల‌కు వెంక‌య్య మాట‌లు కాస్త ఉప‌శ‌మ‌నాన్ని ఇచ్చాయి. చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ప‌ట్టిసీమ ప్రాజెక్టును ఎంత వేగంగా కంప్లీట్ చేశారో...ఇప్పుడు అమ‌రావ‌తి మెట్రోను కూడా అంతే స్పీడ్‌ గా పూర్తి చేస్తే ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మంచి మైలేజ్ ఉండే అవ‌కాశం ఉంది.