Begin typing your search above and press return to search.

వెంక‌య్య‌కూ కోపం వ‌చ్చింది

By:  Tupaki Desk   |   29 Oct 2016 8:23 AM GMT
వెంక‌య్య‌కూ కోపం వ‌చ్చింది
X
పొరుగు దేశం పాకిస్థాన్ దుశ్చ‌ర్య‌ల‌తో శాంత‌మూర్తిగా క‌నిపించే కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు కూడా ఆగ్ర‌హోద‌గ్రుల‌య్యారు. నిత్యం కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ సైనికులు తాజాగా నేటి ఉద‌యం స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళానికి చెందిన జ‌వాను మ‌న్ దీప్ సింగ్‌ ను చంపేశారు. మొండెం నుంచి త‌ల‌ను వేరు చేసిన పాక్ సైనికులు మ‌న్ దీప్ సింగ్‌ ను అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌నపై స‌మాచారం అందుకున్న భార‌త సైన్యం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ప్ర‌తిన‌బూనింది. కాసేప‌టి క్రితం మ‌న్‌ దీప్ సింగ్ భౌతిక కాయం అత‌డి సొంత రాష్ట్రం ఉత్త‌రాఖండ్ రాజ‌ధాని డెహ్రాడూన్‌ కు చేరింది. ఈ సంద‌ర్భంగా అక్క‌డ అశ్రున‌య‌నాల మ‌ధ్య మ‌న్‌ దీప్ సింగ్ మృత‌దేహాన్ని అత‌డి కుటుంబ స‌భ్యులు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌రాఖండ్ సీఎం స్వ‌యంగా అక్క‌డికి వ‌చ్చి మ‌న్‌ దీప్ సింగ్ మృతికి సంతాపం ప్ర‌క‌టించారు. ఇక త‌మ బిడ్డ‌ను పాక్ సైనికులు అత్యంత దారుణంగా చంపిన వైనంపై డెహ్రాడూన్ వాసులు ఆగ్ర‌హావేశాల‌తో ర‌గిలిపోతున్నారు.

ఈ ఘ‌ట‌నపై బీజేపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదం బ్ర‌హ్మాసుర హ‌స్తం వంటిద‌ని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్ ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తోంద‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. పాకిస్థాన్ త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రించారు. తాను పెంచి పోషిస్తున్న ఉగ్ర‌వాదమే త‌న‌ను మింగేస్తున్న విష‌యం పాకిస్థాన్‌ కు అర్ధం కావ‌డం లేద‌ని వెంక‌య్య అన్నారు. పాక్ సైన్యం ప్ర‌తి రోజు భార‌త సైన్యాన్ని రెచ్చ‌గొడుతోంని కూడా ఆయ‌న ఆరోపించారు. పాకిస్థాన్‌ కు పొంచి ఉన్న ఉగ్ర ముప్పును ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముషార్ర‌ఫ్ కూడా ఒప్పుకున్న విష‌యాన్ని కూడా ఈ సంద‌ర్భంగా వెంక‌య్య ప్ర‌స్తావించారు. త‌మ భూభాగం మీద ఉన్న ఉగ్ర‌వాదుల‌కు ఎలాంటి సాయం చేయ‌రాద‌ని కూడా వెంక‌య్య పాక్ పౌరుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/