Begin typing your search above and press return to search.

విశాఖ‌, విజ‌య‌వాడ మెట్రో ప్లాన్లు రెఢీ !!

By:  Tupaki Desk   |   12 Sep 2015 4:27 PM GMT
విశాఖ‌, విజ‌య‌వాడ మెట్రో ప్లాన్లు రెఢీ !!
X
ఏపీలో విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం న‌గ‌రాల్లో మెట్రో రైల్ ఏర్పాటు ప‌నుల‌ను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్‌ కు(డీఎంఆర్‌ సీ) ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు శ‌నివారం విజ‌య‌వాడ‌లో ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు. ఈ రెండు న‌గ‌రాల్లో మెట్రో లైన్ ప్లాన్‌ ను మెట్రో చైర్మ‌న్ శ్రీధ‌ర‌న్ వెంక‌య్య స‌మ‌క్షంలో సీఎం చంద్ర‌బాబుకు అంద‌జేశారు. గ‌తంలోనే విజ‌య‌వాడ లైన్ నివేదిక ప్ర‌భుత్వానికి రాగా..ఇప్పుడు విశాఖ మెట్రో ప్రాజెక్టు నివేదిక కూడా ప్ర‌భుత్వానికి అందింది.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ డీఎంఆర్‌ సీ కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ అయినందున ఈ రెండు ప్రాజెక్టుల‌ను కూడా దానికే ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. మెట్రో ప్రాజెక్టుల్లో ఒక్కో కిలోమీట‌ర్‌కు రూ.265 కోట్ల వ్య‌యం అవుతుంద‌ని...ప్రైవేటు సంస్థల భాగ‌స్వామ్యంతో దీనిని నిర్మించాల‌నుకున్నా ప్ర‌భుత్వం రూ.9 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంద‌ని..ప్ర‌స్తుతం రాష్ర్టంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ ప్రాజెక్టును డీఎంఆర్‌ సీకే ఇచ్చామ‌ని ఆయ‌న చెప్పారు. విజ‌య‌వాడ‌లో బ‌స్టాండ్ నుంచి పెన‌మ‌లూరు వ‌ర‌కు, బ‌స్టాండ్ నుంచి నిడ‌మానూరు వ‌ర‌కు రెండు లైన్ ల‌ను వేస్తున్నారు. ఇక విశాఖ మెట్రో కారిడార్‌ ను 45.5 కిలోమీట‌ర్ల మేర చేప‌ట్ట‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు.

కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ ఈ మెగా ప్రాజెక్టుకు జ‌పాన్‌ కు చెందిన జైకా వంటి సంస్థ‌లు ఆర్థిక సాయం చేస్తాయ‌ని...మెట్రో రైల్ ప్రాజెక్టుకు భారీ కాస్ట్ దృష్ట్యా గుంటూరు వ‌ర‌కు వేయడం సాధ్య‌ప‌డ‌ద‌ని...అందువ‌ల్ల గుంటూరులో ప్ర‌త్యేక స్పీడ్ రైల్ లైన్ వేసే అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. విజ‌య‌వాడ‌లో 26 కిలోమీట‌ర్ల మేర లైన్ ఏర్పాట‌య్యేలా ప్లాన్ డిజైన్ చేసిన‌ట్టు తెలిపారు.

ఏపీలో మెట్రోరైల్ లైన్ ఏర్పాటుకే కేంద్ర ప్ర‌భుత్వం సుముఖంగా లేద‌ని వార్త‌లు వ‌స్తున్నా చంద్ర‌బాబు మాత్రం ముందుగా ఇచ్చిన హామీ మేర‌కు ఈ విష‌యంలో ఫాస్ట్‌గానే అడుగులు వేస్తున్నారు. మ‌రోవైపు కేంద్ర మంత్రి వెంక‌య్య మాత్రం ఈ విష‌యంలో బాబుకు ఫుల్ కోప‌రేట్ చేస్తున్నారు. మెట్రో లైన్ డిజైన్ వ‌చ్చిందని సంబ‌రం చేసుకోవ‌డం కాదు..ఈ రెండు ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం అంటే చంద్ర‌బాబు ముందున్న‌ది ముస‌ళ్ల పండ‌గే.