Begin typing your search above and press return to search.

వెంకయ్య ఏడ్పులు.. నెటిజన్ల పంచులు

By:  Tupaki Desk   |   12 Aug 2021 11:00 AM IST
వెంకయ్య ఏడ్పులు.. నెటిజన్ల పంచులు
X
భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నెటిజన్ల చేతికి చిక్కారు. వారి చేతిలో బుక్కవుతున్నారు. నిన్న రాజ్యసభ జరగడం లేదని.. సభ్యులు అంతరాయం కలిగిస్తున్నారని నిండు సభలో వెంకయ్య కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ గా మారింది.

దేశ అత్యున్నత చట్ట సభలే కాదు.. రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాల వల్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఏ రాష్ట్రఅసెంబ్లీలో అయినా ఇదే గందరగోళం నెలకొంటుంది. తిట్టుకోవడం.. కొట్టుకోవడం.. నానా హంగామా సృష్టించే రాష్ట్ర అసెంబ్లీలను ఎన్నో చూశాం..

ఈ క్రమంలోనే రాజ్యసభలో గందరగోళ పరిణామాలపై ఆ చట్టసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడంపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. 2014లో ఇదే వెంకయ్య నాయుడు నాడు బీజేపీ పక్ష నేతగా రాజ్యసభలో అప్పటి యూపీఏ2 ప్రభుత్వాన్ని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చేసిన బలమైన డిమాండ్ లొల్లి గుర్తుకు రాలేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వెంకయ్య డిమాండ్ కు తలొగ్గి నాడు ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో హోదా ప్రకటించారు. మరి ఇక్కడ ఎందుకు ప్రతిపక్షాలకు అలాంటి అవకాశం ఇవ్వరు.. వారి కోరికలు నెరవేర్చరు అని వెంకయ్యను నెటిజన్లు కాస్త గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.

గర్భగుడిలో ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన మోడీసర్కార్ వైఖరి ఎప్పుడూ కన్నీళ్లు తెప్పించలేదా? ఏపీని వంచించిన మోడీ పాలన తలుచుకొని నిద్రలేని రాత్రులు గడపలేదా? వెంకయ్యా అంటూ నెటిజన్లు, ఏపీ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెంకయ్య ఏడుపుపై పెద్ద ఎత్తున పోస్టులు వెలువడుతున్నాయి.

రాజ్యసభలో ఇంత గొడవకు కారణంగా పెగాసస్, రైతు వ్యతిరేక చట్టాలు. వాటిపై ప్రభుత్వం ప్రతిపక్షాలకు క్లారిటీ ఇస్తే సరిపోతుంది. అది చేయకుండా వెంకయ్య ఏడిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.