Begin typing your search above and press return to search.
అక్కడ బంగారం సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది
By: Tupaki Desk | 15 Dec 2020 9:10 AM ISTవిన్నంతనే నిజమనిపించదు. కానీ.. వివరాల్ని తెలిసిన తర్వాత.. దానికి సంబంధించిన సాక్ష్యాలు చూసిన తర్వాత నిజమే.. అన్న ఆశ్చర్యం కలగటం ఖాయం. సముద్రం ఒడ్డున బంగారం.. వెండి ఆభరణాలు అదే పనిగా దొరుకుతుంటే ఎలా ఉంటుంది? అదెలా సాధ్యమంటారా? కారణం తెలీదు కానీ.. తాజాగా వెనిజులాలో ఈ వింత చోటు చేసుకుంది. కారణాలు తెలీవు కానీ.. ఆ దేశంలోని గ్వాకలోని సముద్రతీర ప్రాంతంలో బంగారం.. వెండి పెద్ద ఎత్తున పడి ఉన్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
దీనికి సంబంధించిన వార్త.. ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఈ బీచ్ ఒడ్డున దాదాపుగా రెండు వేల మత్య్సకార కుటుంబాలు నివసిస్తుంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక మత్య్సకారుడు చేపల వేట కోసం ఉదయాన్నే తీరానికి వెళ్లాడు. అక్కడ ఒడ్డున మెరుస్తున్న వస్తువ కనిపించింది. దీంతో.. దాన్ని చేతిలోకి తీసుకొని చూసుకోగా.. అది బంగారుఆభరణంగా గుర్తించారు.
దీంతో.. ఆ వ్యక్తి అరుపులు.. కేకలు వేయటంతో చుట్టు ఉన్న వారంతా చేరుకున్నారు. ఎవరికి వారు తమ లక్ కు తగ్గట్లు ఏం దొరుకతుుందన్న ఆసక్తితో తెగ వెతుకుతున్నారట. దీనికి తగ్గట్లేఎవరికి వారికి అంతో ఇంతో బంగారం.. వెండి దొరకటంతో సంబరపడిపోతున్నారు. దీంతో.. చుట్టుపక్కల వారు బంగారం.. వెండి ఆభరణాల్ని ఎవరికి చేతనైనంత వారు దొరకపుచ్చుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. ఖరీదైన ఆభరణాలు సముద్రపు ఒడ్డుకుఎలా కొట్టుకు వచ్చాయన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. స్మగ్లింగ్ చేస్తున్న బంగారం.. వెండి కానీ.. లేదంటే.. ఏదైనా రవాణా నౌక ఎక్కడైనా మునిగిపోయి.. అందులోని బంగారం.. వెండి.. ఇలా సముద్రంలో కొట్టుకు వచ్చిందా? అన్నది సందేహంగా మారింది.