Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్

By:  Tupaki Desk   |   28 Sept 2020 9:15 AM IST
బ్రేకింగ్: ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్
X
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 7వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే బయట ఏ కార్యక్రమంలో పాల్గొన్న వారైనా మహమ్మారి బారినపడుతున్నారు.

ఏపీలో తాజాగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

బ్రహ్మోత్సవాల కోసం మంత్రి వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలలో ఉన్నారు. ఈనెల 25న విజయవాడకు చేరుకున్నారు.

ఇక అప్పటి నుంచి వెల్లంపల్లికి స్వల్పంగా కోవిడ్ లక్షణాలు వెలుగుచూశాయి. తాజాగా పరీక్షలు చేయించుకున్నాడు. ఈ పరీక్షల్లో మంత్రికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.