Begin typing your search above and press return to search.
హిందుత్వ పేరుతో వీర్రాజు విజృంభణ
By: Tupaki Desk | 20 Jan 2021 7:00 AM ISTబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విచిత్రమైన వాదన తెరపైకి తెస్తున్నారు. దేవాలయాలపై దాడులకు సంబంధించి కొన్ని ఘటనల్లో తెలుగుదేశంపార్టీ, బీజేపీ నేతలు లేదా వాళ్ళ మద్దతుదారులున్నారని పోలీసులు ప్రకటించారు. వాళ్ళపై కేసులు కూడా నమోదుచేశారు. ఒకవేళ పోలీసులు పెట్టింది తప్పుడు కేసులైతే ఆ విషయాన్ని నిరూపించుకోవాలి. అయితే వీర్రాజు మాత్రం దానికిభిన్నంగా పోలీసులపైనా ప్రభుత్వంపైనా రెచ్చిపోతున్నారు.
రామతీర్ధం దేవాలయాన్ని సందర్శించటానికి వెళితే తనని అడ్డుకున్నారని మండిపోతున్న వీర్రాజు ఇపుడు బీజేపీ వాళ్ళపై కేసులు పెట్టడం ద్వారా హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటు గోల చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఏమిటంటే హిందుత్వం వేరు, బీజేపీ వేరని. బీజేపీలో ఉన్న వారందరూ హిందువులు కారు. అలాగే హిందువులందరు బీజేపీ వాళ్ళూ కారు. హిందుత్వం వేరు, బీజేపీ వేరన్న విషయం అందరికీ తెలిసిందే.
మరి దేవాలయాలపై దాడుల ఘటనలో బీజేపీ నేతలపై కేసులు పెడితే హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయి ? తమ నేతలపై పోలీసులు కేసులు పెట్టిందగ్గర నుండి కావాలనే తెచ్చుపెట్టుకున్న ఆవేశంతో వీర్రాజు రెచ్చిపోతున్నారు. పరిపాలనా పరమైన అంశాలపై ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలో అభ్యంతరాలేవీ ఉండవు. ప్రభుత్వంలో ఎక్కడైనా అవినీతి జరుగుతున్నా లేకపోతే అక్రమాలు జరుగుతున్నా ఎండగట్టాల్సిందే.
పాలనాపరమైన లోటుపాట్లను ఎత్తిచూపి జనాలను ఆకట్టుకోవాల్సిన బాధ్యతున్న వీర్రాజు దానికి భిన్నంగా మతపరమైన భావోద్వేగాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారు ? ఎందుకంటే జనాల భావేద్వాగాలను రెచ్చగొడితే తప్ప జనాలు తమ పార్టీని ఆధరించరని బహుశా వీర్రాజు డిసైడయిపోయినట్లున్నారు. అందుకనే హిందుత్వంపై పేటెంట్ తీసుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. దేవాలయాలపై దాడుల ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోమని డిమాండ్ చేయాల్సిన పార్టీ దానికి భిన్నంగా మాట్లాడటాన్ని జనాలు అర్ధం చేసుకోకుండానే ఉంటారా ?