Begin typing your search above and press return to search.

బాబు వల్ల ప‌వ‌న్‌ కు జ‌రుగుతున్న మేలు ఇది

By:  Tupaki Desk   |   3 Nov 2018 11:26 AM GMT
బాబు వల్ల ప‌వ‌న్‌ కు జ‌రుగుతున్న మేలు ఇది
X
ఔను. జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు ఏపీ సీఎం చంద్ర‌బాబు మేలు చేస్తున్నారు. ఊహించ‌ని రీతిలో నిజంగానే ఆయ‌న ప‌వ‌న్‌ కు స‌హ‌క‌రిస్తున్నారు. జ‌న‌సేన బ‌లోపేతానికి మ‌ద్ద‌తునిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీతో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. దీంతో టీడీపీ - కాంగ్రెస్ కలయికను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్-టీడీపీ కలయికను నిరసిస్తూ మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్‌ కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

తాజాగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో రామచంద్రయ్య మాట్లాడుతూ మొదటి నుంచి తాను చంద్రబాబు విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. విభజన సమయంలో చంద్రబాబు వేసిన వ్యాఖ్యలు తాను మరిచిపోలేనని అన్నారు. తన రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ఎన్ని నాటకాలైనా ఆడతారని రామచంద్రయ్య విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఏ పార్టీతోనైనా కలుస్తారు - విడిపోతారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ కు ఈ రోజు ఈ గతి పట్టడానికి కారణం చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సి. రామచంద్రయ్య చెప్పారు. జిల్లాలో రామచంద్రయ్య కీలక నేతగా ఉన్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన జ‌న‌సేన పార్టీలో చేరుతారనే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. వ‌ట్టి వసంత్ కుమార్ జనసేన లేదా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే త్వరలోనే తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో మాట్లాడిన త‌ర్వాత‌ వట్టి వసంత్ కుమార్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని సమాచారం. అయితే, ఈ ఇద్ద‌రు నేత‌లు జ‌నసేన‌లో చేర‌వ‌చ్చ‌ని అంటున్నారు. కాగా, వీరి చేరిక త‌మ పార్ఈకి ఊపునిస్తుంద‌ని జ‌న‌సేన నేత‌లు ధీమాగా ఉన్నారు. అయితే, ఈ ఇద్ద‌రు నేత‌లు త‌మ చేరిక గురించి ప్ర‌క‌టించాల్సి ఉంది.