Begin typing your search above and press return to search.

సీఎం లావ‌యింది..దించేద్దాం..ఇది అవ‌మానక‌రం

By:  Tupaki Desk   |   7 Dec 2018 3:55 PM IST
సీఎం లావ‌యింది..దించేద్దాం..ఇది అవ‌మానక‌రం
X
రాజస్థాన్‌ లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల సంద‌ర్భంగా హాట్ హాట్ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్వార్‌ లో జనతాదళ్(యూ) బహిష్కృత నేత శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ సీఎం వసుంధర రాజె విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఆమె బాగా లావయ్యారని అన్నారు. `వసుంధర రాజెకు విశ్రాంతి ఇవ్వండి. ఆమె బాగా అలసిపోయారు. మొదట సన్నగా ఉన్న ఆమె ఇప్పుడు బాగా లావయ్యారు. వసుంధర మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన కుమార్తె`` అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఝాల్‌ రాపఠాన్ నియోజకవర్గంలో మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ పోలింగ్ బూత్‌ లో వసుంధర ఓటు వేశారు. తన కొడుకు - ఎంపీ దుశ్యంత్ సింగ్ - ఆయన భార్య నిహారికా సింగ్‌ లతో కలిసి ఆమె ఓటు వేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఓటు వేసిన తర్వాత ముఖ్యమంత్రి వసుంధర రాజె జేడీయూ మాజీ అధినేత శరద్ యాదవ్‌ పై తీవ్రంగా మండిపడ్డారు. తన బరువుపై ఆయన కామెంట్ చేయడాన్ని తప్పుబట్టారు. `ఇది నాకు చాలా అవమానకరం. ఆయన అందరు మహిళలను అవమానించారు` అని రాజె అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నేనెప్పుడూ ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయను. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా ఎన్నికల సంఘం శరద్ యాదవ్‌ పై చర్యలు తీసుకోవాలి అని వసుంధర రాజె డిమాండ్ చేశారు.