Begin typing your search above and press return to search.
ప్రముఖ చైన్ ఆసుపత్రుల యజమాని అనుమానస్పద మృతి
By: Tupaki Desk | 17 Nov 2020 11:30 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం వాసన్ ఐకేర్. కంటి ఆసుపత్రి ఖరీదైన వ్యవహారంగా భావించే రోజుల్లో చౌక ధరలతో వైద్యాన్ని అందించే చైన్ ఆసుపత్రుల్ని నెలకొల్పడటంలో వాసన్ ఐ కేర్ సక్సెస్ అయ్యిందని చెప్పారు. దాని వ్యవస్థాపకులు డాక్టర్ ఏఎం అరుణ్ హఠాన్మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయనది అనుమానాస్పద మరణంగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం దాన్ని సహజ మరణంగానే అభివర్ణిస్తున్నారు. 51 ఏళ్ల చిన్న వయసులో చెన్నైలోని తన నివాసంలో చలనం లేకుండా పడి ఉండటాన్ని గుర్తించారు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా చెబుతున్నారు. సహజ మరణంగానే తాము భావిస్తున్నట్లుగా అరుణ్ కుటుంబ సభ్యులు చెబుతున్నా.. బంధువులు.. స్నేహితులు మాత్రం అనుమానాస్పద మరణంగా చెబుతుననారు.
దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు డాక్టర్ అరుణ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. తిరుచునాపల్లిలో 60 ఏళ్లుగా నడుస్తున్న ఒక మెడికల్ షాపులో కొన్ని వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. అది కాస్తా సక్సెస్ అయిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మొత్తం 100కు పైగా కంటి ఆసుపత్రులు.. డెంటల్ సేవల్ని అందిస్తున్నారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ చైన్ ఆసుపత్రుల్ని షురూ చేశారు. అలాంటి వ్యక్తి.. చిన్న వయసులోనే మరణించటం అందరిని కలిచి వేస్తోంది.