Begin typing your search above and press return to search.

ఇలియానాతో ముడిపెట్టి కేసీఆర్ పై వర్మ కామెంట్

By:  Tupaki Desk   |   2 Nov 2019 5:37 AM GMT
ఇలియానాతో ముడిపెట్టి కేసీఆర్ పై వర్మ కామెంట్
X
వివాదాలు లేనిదే పొద్దుగడవని రాంగోపాల్ వర్మ తన పర అనే బేధం లేకుండా అందరిపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సినిమా ప్రముఖులనే కాదు.. రాజకీయ నేతలను కూడా వదలకుండా సెటైర్లు వేస్తుంటారు. కొద్దిరోజులుగా ఏపీలోని రాజకీయ పక్షాలను, చంద్రబాబు గ్రూపును టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ తాజాగా సీఎం కేసీఆర్ పై హాట్ కామెంట్ చేశారు. ఇలియానాతో ముడిపెట్టి వర్మ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి..

వర్మ మాట్లాడుతూ తన దృష్టిలో ఇలియానా కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా అందగాడు అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు రాంగోపాల్ వర్మ. కేసీఆర్, ఇలియానా మ్యాటర్ లో తనదైన లాజిక్ ను జోడించాడు. ఇలియానా అంత సేపు చూడడం సాధ్యం కాదని.. కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు గంట కాదు.. ఎంతసేపు అయినా చూస్తుండి పోతానని వర్మ అన్నారు. కేసీఆర్ మాటలు.. హావభావాలు రెప్ప వాల్చకుండా చూసేస్తుంటానని వర్మ చెప్పాడు. ఇదే ఇలియానాను అంత సేపు చూడలేం అంటూ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు వర్మ.

ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై కమ్మ రాజ్యంలో కడపరెడ్లు సినిమా తీసిన రాంగోపాల్ వర్మ ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా కేసీఆర్ పై హాట్ కామెంట్ చేశారు. కానీ వర్మ చెప్పిన లాజిక్ మాత్రం కరెక్ట్ అని నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. కొందరు మాత్రం ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు.