Begin typing your search above and press return to search.

ఉరుము ఉరిమి చిరంజీవి మీద పడింది

By:  Tupaki Desk   |   2 March 2016 11:18 AM IST
ఉరుము ఉరిమి చిరంజీవి మీద పడింది
X
ఏపీ పాలిటిక్స్ లో పనికిమాలినోళ్లు ఎవరు? దీనికి సమాధానంగా కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య నోటి వెంట చంద్రబాబు పేరు వస్తే... అందుకు కౌంటర్ గా టీడీపీ నేత వర్ల రామయ్య ఆ హోదా రామచంద్రయ్యకే కట్టబెట్టారు. అక్కడితే ఆగని ఆయన రామచంద్రయ్యకు ప్రియతమ నాయకుడైన చిరంజీవినీ ఈ వివాదంలోకి లాగి ఆయన్నూ యూస్ లెస్ ఫెలో అని అనేశారు. దీంతో ఉరుము ఉరిమి చిరంజీవిపై పడినట్లయింది.

చంద్రబాబునాయుడు యూజ్‌లెస్‌ చీఫ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ దిస్ స్టేట్ అని రామచంద్రయ్య విమర్శించిన విషయం తెలిసిందే.... ఆయన చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలకు టీడీపీ నేత వర్ల రామయ్య అంతకంటే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రామచంద్రయ్య దగ్గర సలహాలు తీసుకున్న వారు యూజ్‌ లెస్‌ ఫెలోగా మారిపోతారని అన్నారు. చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో యూజ్‌ లెస్‌ ఫెలోగా మారిపోవడానికి ఈ యూజ్ లెస్‌ ఫెలో( సి. రామచంద్రయ్య) ఇచ్చిన సలహాలే కారణమని రామయ్య కడిగిపారేశారు. అంతేకాదు.... రామచంద్రయ్య మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చిరంజీవి అంటే రామచంద్రయ్యకు ఎక్కువ అభిమానం... ఎవరైనా చిరును విమర్శిస్తే రామచంద్రయ్య వెంటనే కౌంటరేయడానికి ట్రై చేస్తారు... దీంతో తమ నేత చంద్రబాబును తిట్టిన రామచంద్రయ్య ఇంకోసారి నోరుజారకుండా ఉండేలా ఆయన 'చిరు' బలహీనతను ఆధారంగా చేసుకుని వర్ల రామయ్య ఇచ్చిన ఘాటైన దెబ్బకు టీడీపీ నేతలంతా మెచ్చుకుంటున్నారట. పాపం... రామచంద్రయ్య మాత్రం ఊహించని ఈ దెబ్బతో అనవసరంగా నోరు జారి చిరంజీవి వద్ద చెడ్డయిపోయానని తెగ బాధపడుతున్నారట.