Begin typing your search above and press return to search.

రోజాను అడ్డుకోగల సత్తా వాణీకుందా?

By:  Tupaki Desk   |   15 Sep 2017 5:33 AM GMT
రోజాను అడ్డుకోగల సత్తా వాణీకుందా?
X
1990వ దశకంలో వానపాటలతో మనల్నిఅలరించిన మలయాళీ ముద్దుగుమ్మ వాణీ విశ్వనాథ్ గుర్తు ఉంది కదండీ మీకు. గుర్తు లేకపోతే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా చూడండి. అందులో అమ్మడు చిరుతో కలిసి తెల్లచీరలో తడుస్తూ తన అందాలని వాటంగా వడ్డించింది. తెలుగు చిత్రాలతోపాటు తమిళం - మళయాలం - హిందీ సినిమాల్లోనూ తన మలయాళీ పరువాలను ఆరబోసి ఆకట్టుకుంది. ఆ తర్వాత అందరి హీరోయిన్లలానే పెళ్లి చేసుకుని కనుమరుగై పోయింది. ప్రస్తుతం ఆమె సినిమాలు చేయక 20 ఏళ్లు అవుతుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మొఖానికి రంగేసుకుని ఇటీవల మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో విడుదలైన జయ జానకి నాయక చిత్రంలో కనిపించింది.

తాజాగా ఒక పత్రికతో మాట్లాడిన వాణి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు.. అందులోనూ తెలుగు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను వెల్లడించింది. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు అంటే తనకు ఇష్టమంటోంది. చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు ఈమెను పార్టీలోకి ఆహ్వానించి ఆ జిల్లాలోని నగరి నుంచి పోటీకి దింపాలనుకుంటున్నారంట. ఇదే విషయాన్ని తమ పార్టీ అధిష్టానానికి తెలియజేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి వైసీపీలో వాగ్ధాటి గల నాయకురాలు - ఏ విషయాన్నిఅయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే రోజా ఎమ్మెల్యేగా ఉన్నారు. తమ పార్టీ అధినేతపై, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని చినబాబు లోకేశ్ బాబుపై విమర్శలు చేసే రోజాను ఎలాగైనా ఈసారి ఓడించాలని తెలుగుదేశం నేతలు కంకణం కట్టుకున్నారంట. ముల్లును ముల్లుతోనే తీయాలని సినీ రంగం నుంచి వచ్చిన రోజాను అడ్డుకోవాలంటే అదే రంగానికి చెందిన వారిని పోటీపెట్టడం మంచిదని ఆలోచిస్తున్నారంట. అయితే రోజాకు రాష్ర్టవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్, వాగ్ధాటి.. వాణీ విశ్వనాథ్ కు ఎక్కడ ఉన్నాయని.. ఆమెను పోటీపడితే మళ్లీ ఈసారి కూడా రోజా ఘనవిజయం సాధిస్తుందని కొంతమంది భయపడుతున్నారంట.

స్థానికురాలు కూడా కాని వాణీ విశ్వనాథ్.. రోజాకు పోటీ అంటే మనకే నవ్వు వస్తుంది కదూ! ఆమెకు తెలుగే రాదు. రోజా ఇప్పటికే కాల్ మనీ సెక్స్ రాకెట్ - మహిళా అధికారులపై తెలుగుదేశం నేతల దాడులు, బెల్టు షాపులు వంటివాటిపై రాష్ట్ర స్థాయిలో మహిళల్లో మంచి కదలిక తెచ్చారు. వైసీపీలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విషయ పరిజ్ఞానం ఉండి ఏ విషయంపైన అయినా మాట్లాడగల సత్తా ఉన్నవారిలో రోజా ఒకరు. అలాంటిది వాణి నగరిలో పోటీ చేయడమంటే డిక్కీ బలిసిన కోడి వచ్చి చికెన్ షాపు ముందు తొడకొట్టినట్టే.