Begin typing your search above and press return to search.

ఓటర్లపై విమర్శలు - వాణిదేవి ఫస్ట్రేషన్ ను అర్థం చేసుకోవచ్చు

By:  Tupaki Desk   |   20 March 2021 4:50 AM GMT
ఓటర్లపై విమర్శలు - వాణిదేవి ఫస్ట్రేషన్ ను అర్థం చేసుకోవచ్చు
X
ఆమె ఒక అధ్యాపకురాలు. ఎంతో మందికి పాఠాలు చెప్పి.. విద్యాబుద్ధులు నేర్పారు. అలాంటి ఆమె తొలిసారి ప్రజాజీవితంలోకి అడుగు పెట్టి.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగారు. అలాంటి ఆమె.. తాజాగా జరుగుతున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీగా నమోదైన చెల్లని ఓట్ల విషయంలో చోటు చేసుకున్న లోపాలపై ఫస్ట్రేషన్ చెందారు. హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఏకంగా 21,304. ఒక రకంగా చూస్తే.. చెల్లని ఓట్ల విషయంలో ఓటర్ల తప్పులు కొట్టొచ్చి కనిపిస్తే.. తాము ఏం చేస్తే ఓట్లు చెల్లవని తెలిసి కూడా.. తప్పులు చేయటం గమనార్హం.

నిజానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో జరిగిన ఒక కన్ఫ్యూజన్ టీఆర్ఎస్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న వాణీదేవి.. బ్యాలెట్ పేపర్లో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆమె పేరు ఎదుట ‘‘1’’ అన్న నెంబరు వేయాలి. కానీ.. చాలామంది ‘‘4’’గా ఆమె పోటీచేస్తున్న అంకెను వేసేశారు. నిబంధనల ప్రకారం ఇలా చేస్తే తప్పు అవుతుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఓటరు ఇలాంటి తప్పును ఎలా చేస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. అంతేకాదు.. ఓట్ల లెక్కింపు లో.. తాము ఇవ్వాల్సిన ప్రాధాన్యత సంఖ్యకు బదులుగా టిక్కు మార్కు పెట్టటం కూడా ఓట్లు చెల్లకుండా పోయాయి.

కొందరు అంకెలకు బదులుగా.. వన్.. టూ అంటూ ఇంగ్లిషులో రాయటం.. ఐ లవ్యూ.. జై కేసీఆర్ అంటూ రాయటం కూడా ఓట్లు చెల్లకపోవటానికి కారణమైంది. చాలామంది ఒకటో నెంబరు ప్రాధాన్యత ఇవ్వకుండా.. వేరే సంఖ్యలు వేశారు. ఇలా చెల్లని ఓట్లు అధికంగా ఉన్న తీరుపై టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఫస్ట్రేట్ అయ్యారు. ఇన్నేళ్లుగా వాళ్లు ఏం చదువుకున్నారు? చదువు చెప్పిన వ్యవస్థ ఎటువైపు సాగుతోందనే ప్రశ్నలు తలెత్తేలా ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే.. గ్రాడ్యుయేషన్ చేసిన ఓటర్లే ఓటు వేసే విషయంలో తప్పు చేస్తే.. ఏమనగలం?