Begin typing your search above and press return to search.

రంగా జిల్లా కోసం 'వంగవీటి' మొదలుపెట్టిన లొల్లి

By:  Tupaki Desk   |   28 Feb 2022 5:17 AM GMT
రంగా జిల్లా  కోసం వంగవీటి మొదలుపెట్టిన లొల్లి
X
ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆయా ప్రాంతాల్లోని ప్రముఖు పేర్లు పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా కృష్ణ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ నాయకులు చేస్తున్న డిమాండ్ తో రాజకీయ వేడి మొదలైంది.

కృష్ణ జిల్లాకు రంగా ఎంతో చేశారని, ఆయన పేరు పెట్టేదాకా ఉద్యమం చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా కుమారుడు వంగవీటీ రాధా హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ తను చేయనని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని బతిమిలాడుకోనని అన్నారు. ఓ వైపు టీడీపీ నాయకులు రంగా పేరు కోసం ఆందోళన చేస్తుంటే ఆయన కుమారుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

వంగవీటి రంగా పేరు చెప్పుకొని కొందరు పదవులు అనుభవిస్తున్నారని, ఆయనపై అభిమానం ఉంటే పేరు పెట్టాలన్నారు. అయితే ఆయన పేరు కోసం ప్రత్యేకంగా తాను ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏదన్నారు. ‘వంగవీటి రంగా కుమారుడిడిగా పుట్టడమే నా అదృష్టం. ఆయన ప్రజల గుండెల్లో పదిలమయ్యారు. ఆయన పేరును జిల్లాకు పెట్టడం వల్ల కొత్తగా వచ్చేది ఏమీ లేదు.

అయితే ఆయన పేరును వాడుకున్నవారు మాత్రం అధికారికంగా అనౌన్స్ చేస్తే స్వాగతిస్తానని అన్నారు. అంతేగానీ జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్న డిమాండ్ చేయలేనని అన్నారు.

వంగవీటి రంగా విగ్రహాలు పలు ప్రాంతాల్లో నెలకొల్పారు. ఈ విగ్రహాలను వంగవీటి రాధా ప్రారంభిస్తూ వస్తున్నారు. ఓ విగ్రహం ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఓ వైపు టీడీపీ నాయకులు మాత్రం కృష్ణ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆందోళన చేస్తున్నారు.

ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎంతోచేశారని ఆయన గుర్తుగా పేరు పెట్టాలని అంటున్నారు. మరోవైపు కొందరు అధికార పార్టీలోని వారు కొందరు వంగవీటి రంగా పేరు పెట్టాలని అనుకుంటున్నారు.

ఏపీతో పాటు తెలంగాణలో రంగాకు అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన విగ్రహాలను తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగా ఒక ప్రాంతానికే పరిమితం కాలేదని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే ఆయన ద్వారా లబ్ధిపొందిన వారు అధికార పార్టీలో కూడా ఉన్నారని, వారు రంగా పేరు పెట్టేందుకు బాధ్యత తీసుకోరా..? అని ప్రశ్నించారు. బతిమిలాడితే గానీ జిల్లాకు పేరు పెట్టరా..? అని రాధా ఈ సందర్భంగా అన్నారు.