Begin typing your search above and press return to search.

అభిమానుల పేరుతో వర్మకు వార్నింగ్

By:  Tupaki Desk   |   25 Jan 2016 9:39 AM IST
అభిమానుల పేరుతో వర్మకు వార్నింగ్
X
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ మీడియాలోకనిపించే సినీ ప్రముఖుల్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒకరు. విషయం ఏదైనా సరే తనదైన శైలిలో చెలరేగిపోతూ విమర్శలు చేసే ఆయనకు తాజాగా ఒక వార్నింగ్ ఇచ్చారు వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధా. తాను వంగవీటి రంగా కథతో సినిమా తీస్తానని వర్మ ప్రకటపై రాధా రియాక్ట్ అయ్యారు.

ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంలో వర్మ తీసే చిత్రాలు పక్షపాతంతో ఉంటాయని.. రంగా జీవితచరిత్రపై ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని.. అందుకు భిన్నంగా ప్రయత్నిస్తే మాత్రం తన కంటే కూడా రంగాను అభిమానించే అభిమానులు తీవ్రంగా స్పందిస్తారంటూ వ్యాఖ్య చేశారు. రంగాపై బురద జల్లే విధంగా సినిమా తీస్తే రంగా కొడుగ్గా తాను స్పందించే దాని కంటే తీవ్రంగా రంగా అభిమానులు రియాక్ట్ అవుతారంటూ హెచ్చరిస్తున్నారు.

పక్షపాత ధోరణితో సినిమాలు తీస్తారంటూ వ్యాఖ్యానించిన వంగవీటి రాధా.. వర్మకు నేరుగా ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు తాజా సంచలనమైంది. మరి.. రాధా వ్యాఖ్యలపై వర్మ రియాక్షన్ ఏమిటో..?