Begin typing your search above and press return to search.
ఓటములు నేర్పిన పాఠం: కళ్లు తెరచిన వంగవీటి రాధ
By: Tupaki Desk | 10 Feb 2020 4:10 PM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దురదృష్టమంటే వంగవీటి రాధాదే. ఆయన వేసే రాజకీయ తప్పటడుగులు ఆయన భవిష్యత్ ను నాశనం చేస్తున్నాయి. గతంలో 2012 సమయంలో వైఎస్సార్సీపీలో చేరి 2014 ఎన్నికలను ఎదుర్కొని పరాజయం పొందారు. ఆ తదనంతరం 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారం నుంచి దూరమైంది. అప్పుడు అధికారంలోకి టీడీపీ రాగా ఇప్పుడు వైఎస్సార్సీపీ వచ్చింది. ఎటు తిరిగి రెండుసార్లు అధికారం నుంచి రాధ దూరమయ్యాడు. ఎప్పటినుంచో ప్రభుత్వం లో భాగమవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. అలాంటి వైఖరి నుంచి ఇప్పుడు మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నన్నాళ్లు ఒకే పార్టీలో ఉండి కలిసి కష్టపడి పని చేస్తే ఫలితం అదే వస్తుందని గ్రహించి ఉన్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే కొన్నాళ్లుగా రాధ చాలా బిజీగా గడుపుతున్నాడు. చాలా బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నానని గుర్తించి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నాడు. రాజకీయంగా కీలక పాత్ర పోషించే బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా వ్యక్తి ఇప్పుడు సరికొత్త మార్గంలో వెళ్తున్నాడు. అనుచర గణం, తన ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తగా రాజధాని రైతుల ఉద్యమం సాగుతోంది. 50 రోజులకు పైగా చేస్తున్న ఉద్యమం లో మద్దతు తెలుపుతూ రాధా కూడా పాల్గొంటున్నాడు.
వరుస ఓటముల నుంచి తేరుకుని ఇప్పుడు రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో క్రమంగా పర్యటిస్తున్నారు. వారికి సంఘీభావం తెలుపుతూ పోరాటం చేస్తున్నారు. అమరావతి జేఏసీ నేతలతో టచ్‌లో ఉంటూ విజయవాడలో ప్రతి రోజూ రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ ఆందోళనా కార్యక్రమాలు చేస్తున్నారు. పక్క జిల్లాలకు వెళ్లి రాధ మరీ రాజధాని ఉద్యమానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రావుల పాలెంలో మాజీ ఎంపీ హర్ష కుమార్‌తో కలిసి భారీ ర్యాలీ కూడా నిర్వహించారు.
ప్రస్తుతం టీడీపీ లో కొనసాగుతున్న వంగవీటి రాధా సొంత కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాడు. ఇటీవల పలుమార్లు చంద్రబాబు - లోకేశ్ తో రాధ సమావేశమయ్యారు. అనంతరం రాజధాని గ్రామాల్లో వంగవీటి పర్యటనలు చేస్తూ తన భవిష్యత్ కు బాటలు వేసుకుంటున్నారు. అందుకే అమరావతి ఉద్యమం లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల మెప్పు పొందనిది ఏ నాయకుడు రాజకీయాల్లో రాణించలేడని విషయం గమనించి రాధ ప్రజల్లోకి వచ్చాడని పలువురు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నట్లు రాధ అనుచరులు పేర్కొంటున్నారు.