Begin typing your search above and press return to search.

కొడాలి నాని, వంగవీటి రాధా మళ్లీ ఆశ్చర్యపరిచారు

By:  Tupaki Desk   |   20 March 2022 2:30 AM GMT
కొడాలి నాని, వంగవీటి రాధా మళ్లీ ఆశ్చర్యపరిచారు
X
రాజకీయాలు వేరే.. వారి మధ్య స్నేహం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటోంది. పార్టీలు వేరేనా ఆ స్నేహితులు ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరించుకుంటుటున్నారు. ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత కొడాలినాని, టీడీపీ నేత వంగవీటి రాధా ఇద్దరూ క్రేజ్ ఉన్న నేతలే. వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా వీరిద్దరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు.

సాధారణంగా వైసీపీ, టీడీపీ నేతలు అనేక అంశాలపై ఆరోపణలు చేసుకోవడం మామూలే. కొడాలి నాని నిత్యం చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటారు. ప్రతిగా టీడీపీ నేతలు కూడా కొడాలి నానిని టార్గెట్ చేస్తుంటారు. కానీ కొడాలి నాని, రాధా అనుబంధంపై ఈ మాటల యుద్ధం ప్రభావం ఉన్నట్లే కనిపించదు.

తాజాగా గుడివాడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆడపా వెంకటరమణ(బాబ్జి) అంతిమయాత్రలో మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా పాల్గొన్నారు. బాబ్జి ఆకస్మిక మృతి పట్ల నివాళి అర్ిపంచారు. ఈ సందర్భంగా వారిద్దరూ అతి సాధారణంగా ఓ ఆటోలో కూర్చొని టీ తాగుతూ కనిపించారు.

కొంతకాలంగా కొడాలి నాని తన స్నేహితుడు రాధాను వైసీపీలోకి తీసుకురావాలని బావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే కొడాలి నానితో ఉన్నంత సన్నిహితంగా వంగవీటి రాధా టీడీపీ నేతలు ఉండడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక ఇదివరకూ ఓ పెళ్లిలో కూడా కలుసుకున్న రాధా, నానిలు ఇలానే వంశీ సమక్షంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇప్పుడు మరోసారి అలా కనిపించడంతో ఆ ఫొటో వైరల్ అవుతోంది.