Begin typing your search above and press return to search.

వందే భారత్ మిషన్.. తెలుగు వారి కోసం స్పెషల్ సర్వీసులు

By:  Tupaki Desk   |   20 May 2020 2:30 PM GMT
వందే భారత్ మిషన్.. తెలుగు వారి కోసం స్పెషల్ సర్వీసులు
X
వందే భారత్ మిషన్‌లో భాగంగా మనీలా, అబుదాబి నుంచి విశాఖపట్నంకు 320 మంది ప్రయాణికులతో అతిపెద్ద విమానం రాత్రి విశాఖపట్నంకు చేరుకుంది. విమానాశ్రయం లోనే వీరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి.. ప్రత్యేక బస్సుల్లో వారిని స్వస్థలాలకు తరలించనున్నారు. వందేభారత్‌ మిషన్‌ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల ను ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్నారు. రెండో విడతలో ఏపీకి ఈ వారంలో నాలుగు ప్రత్యేక విమానాలు రానున్నాయి. అందులో మొదటి విమానం ఇప్పటికే విశాఖపట్నం చేరుకుంది.

ఇక సౌడ్య్ నుండి విజయవాడకు ఈ రోజు మరో విమానం రానుంది.ఎయిరిండియా 1914 విమానంనేడు జెడ్డా నుంచి విజయవాడకు రాత్రి 10గంటల 15నిమిషాలకు చేరుకోనుంది. ఇదే విమానంలో ప్రయాణించే తెలంగాణ వారిని విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఏఐ1407 విమానంలో హైదరాబాద్ ‌కు చేర్చనున్నారు. మొదటి విడతలో వయసు పై బడ్డ వారితో పాటు పిల్లలు, వృద్దులు, మహిళలు, అనారోగ్యం బాగా లేని వారికి ప్రాధాన్యం ఇచ్చారు. అందులో కేరళతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈసారి మాత్రం తెలుగువారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

కువైట్ నుంచి గురు, శుక్రవారాల్లో 144 మంది గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. ఆమ్నెస్టీ ద్వారా కువైట్ నుంచి రెండు విమానాల ద్వారా గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. అలాగే వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులను తీసుకుని న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం ఈ నెల 27న ఉదయం 11.30 గంటలకు గన్నవరం చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్‌ పోర్టులోని అంతర్జాతీయ టెర్మినల్ ‌ను అధికారులు సిద్ధం చేశారు. ప్రయాణికులు ఇక్కడికి చేరుకోగానే వైద్య పరీక్షలు, థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు ద్వారా ప్రయాణికుల ఎంపిక మేరకు ప్రభుత్వ, పెయిడ్‌ క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తారు.