Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటితో తెలంగాణ మంత్రి వ్యాపారాలు!

By:  Tupaki Desk   |   16 Feb 2017 10:35 AM GMT
ల‌గ‌డ‌పాటితో తెలంగాణ మంత్రి వ్యాపారాలు!
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి త‌న విమ‌ర్శ‌ల జోరును మ‌రింత ఉధృతం చేశారు. తాను చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రమ్మంటే తోక ముడిచిన జూపల్లి... పార్టీ ఎమ్మెల్యేలతో త‌న‌పై విమర్శలు చేయిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అయితే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు త‌న‌పై చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని తెలిపారు. త‌న‌పై విమర్శలు చేసినప్ప‌టికీ ఎమ్మెల్యేలు మాట్లాడిన భాష చాలా హుందాగా ఉంద‌ని పేర్కొంటూ మంత్రి హోదాలో ఉన్న జూప‌ల్లి కృష్ణారావు త‌న ఎమ్మెల్యేలను చూసి హుందాతనం నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర కాంట్రాక్ట‌ర్ లగడపాటి రాజ‌గోపాల్ తో త‌న‌కు ఉన్న లోపాయికారి ఒప్పందాలను జూప‌ల్లి కృష్ణారావు బయటపెట్టాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు

పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం పంప్ హౌస్ లో జరిగిన అవినీతి ని పక్కదారి పట్టించడానికే జూపల్లి నాపై దుర్బాషలాడుతూ మాట్లాడార‌ని వంశీచంద్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జూపల్లికి క్షమాపణ చెప్పే సమస్యే లేదని స్ప‌ష్టం చేశారు. "దేవుడి మాన్యాలు కాజేసిన వాడిని దగుల్బాజీ అన‌కుండా ఏమని పిల‌వాలి? బ్యాంకులను లూటీ చేసిన వాడిని 420 అన‌కుండా ఇంకెలా పిలుస్తారు? జూపల్లి కృష్ణారావు నాపై అనుచిత వ్యాఖ్యాలు చేయడం వల్లె ...నేను కూడా స్థాయి దిగజారి మాట్లాడాల్సి వచ్చింది. నేను పేపర్ పులినా .. లేక అసెంబ్లీ పులినా అనేది త్వ‌ర‌లో తేలుతుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నా తడాఖా చూపిస్తా" అంటూ స‌వాల్ విసిరారు. తన‌ను కల్వకుర్తి లో తిరగ నీయమని చెబుతున్నారని తాను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీటి కోసం పోరాడుతున్నందుకు తిరగ‌నివ్వ‌రా అంటూ వంశీచంద్ రెడ్డి ప్ర‌శ్నించారు. త‌న నియోజకవర్గ ప్రజల కోసం ఎంతటి పెద్ద నాయకుడితో అయినా పెట్టుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. తాను ఎవరి జోలికి వెళ్ళానని, త‌న జోలికి ఎవరన్నా వస్తే వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. టీఆర్ ఎస్ నేతలు విడతలవారిగా ఎందుకు త‌న‌పై విమర్శలు చేస్తున్నార‌ని పేర్కొంటూ ఎంత మంది వస్తారో అందరు ఒకేసారి రండని స‌వాల్ విసిరారు. అందరికీ సమాధానం చెప్పేందుకు తాను రెడీ అని ప్ర‌క‌టించారు. సింహం సింగిల్ గానే వస్తుందని, పందులే గుంపుగా వస్తాయని వంశీచంద్ రెడ్డి టీఆర్ ఎస్ నేత‌ల‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/