Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీ మోహన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడా?

By:  Tupaki Desk   |   29 Oct 2019 10:00 AM GMT
వల్లభనేని వంశీ మోహన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడా?
X
ఒక పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరాలనుకునే వ్యక్తి ఎవరూ ఇలా వ్యవహరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయలేదు వల్లభనేని వంశీ. సీఎం జగన్ మోహన్ రెడ్డిని అయితే కలిశాడు. అయితే అంతకన్నా మునుపే ఆయన వెళ్లి బీజేపీ నేతగా చలామణిలో ఉన్న సుజనా చౌదరిని కలిశాడు. ఆ తర్వాతే వెళ్లి జగన్ తో సమావేశం అయ్యాడు.

మరోవైపు చంద్రబాబు నాయుడను పల్లెత్తు మాటా అనడం లేదు! ఇలా మూడు పార్టీల వాళ్లతో దోస్తీ చలాయించాలనేది వల్లభనేని వంశీ ప్లాన్ అనే టాక్ మొదలైంది.

ఒకవైపు వంశీకి కేసుల భయం గట్టిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలకు సంబంధించి అప్పుడు కేసులు నమోదు కాలేదు. ఇప్పుడు కేసులు నమోదు కాకుండా ఆగడం లేదట. ఈ నేపథ్యంలో వంశీమోహన్ కొత్త గేమ్ ప్లాన్ ను అమలు చేస్తున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అందులో భాగంగా ముందుగా భారతీయ జనతా పార్టీలోకి టచ్ లోకి వెళ్లాడు. అందుకే సుజనా చౌదరిని కలిశాడని అంటున్నారు.ఆ తర్వాతి సమావేశం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో జరిగింది. జగన్ తో సమావేశం మీడియాలో హైలెట్ అయ్యేలా ఆయనే చూసుకున్నాడట. ఇక తెలుగుదేశం పార్టీకి రాజీనామా అన్నారు కానీ - చంద్రబాబు నాయుడును పల్లెత్తు మాట అనలేదు. తెలుగుదేశం వైఖరి ఎలాంటి స్పందనా లేదు. ఇదంతా చూస్తుంటే.. అందరికీ దగ్గర - అందరికీ దూరం అన్నట్టుగా వంశీ గేమ్ ఆడుతున్నాడని - ఇదంతా కేసుల భయమే అని వార్తలు వస్తున్నాయి.

తనపై నమోదు అయినవి తప్పుడు కేసులు అయితే వంశీ ఆ విషయాలను రుజువు చేసుకోవాలి కానీ, ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడితే వచ్చేదేంటి? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం అవుతున్నాయి.