Begin typing your search above and press return to search.

'బీజేపీ వాళ్లతో టచ్లో ఉన్నా.. కానీ టీడీపీలోనే!'

By:  Tupaki Desk   |   9 July 2019 5:33 PM IST
బీజేపీ వాళ్లతో టచ్లో ఉన్నా.. కానీ టీడీపీలోనే!
X
తను భారతీయ జనతా పార్టీ వాళ్లతో టచ్లో ఉన్న మాట వాస్తవమే అన్నట్టుగా మాట్లాడారు తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. ఇటీవలే తెలుగుదేశాన్ని వీడి బీజేపీలో చేరిన సుజనా చౌదరితో కూడా తన సత్సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయని వల్లభనేని చెప్పుకొచ్చారు.

అయితే అంత మత్రాన తను బీజేపీలో చేరుతున్నట్టు కాదని వంశీ తేల్చేశారు. అలాగే ఇటీవల తను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశం కావడం కూడా నిజమే అని వంశీ తేల్చారు. స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కిషన్ రెడ్డితో తను సమావేశం అయిన విషయాన్ని వంశీ ధ్రువీకరించారు.

అయితే తను తెలుగుదేశం పార్టీని మాత్రం వీడటం లేదని ఈయన చెప్పారు. తను సినీ నిర్మాతను అనే విషయాన్ని వంశీ గుర్తు చేశారు ఈ సందర్భంగా. సినీ నిర్మాతగా తను ఎన్నో కథలు విన్నట్టుగా అయితే..ఇప్పుడు తను పార్టీ మారబోతున్నట్టుగా సోషల్ మీడియాలో కథలు వినిపిస్తూ ఉన్నాయని వంశీ చెప్పుకొచ్చారు!