Begin typing your search above and press return to search.
జగన్ నిర్ణయంపై వెల్లువెత్తున్న నిరసనలు.. చివరికి ఆ ఎమ్మెల్యే కూడా!
By: Tupaki Desk | 21 Sep 2022 11:46 AM GMTవిజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టడంపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్టీఆర్ అభిమానుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 1998 నుంచి విజయవాడలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు ఉండగా.. ఇప్పుడు దాన్ని మారుస్తూ జగన్ ప్రభుత్వం అసెంబ్లీ బిల్లు పెట్టి ఆమోదింపజేసింది.
దీనిపై వివిధ రాజకీయ పార్టీల్లోనే కాకుండా జగన్ సొంత పార్టీ వైఎస్సార్సీపీలో నిరసనలు రేగాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని, అసంతృప్తికి గురి చేసిందని చెప్పారు.
ఇప్పుడు ఈ కోవలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కూడా చేరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాకు పేరు పెట్టి ఆయనను జగన్‌ను గౌరవించారని.. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు మార్చడం సరికాదన్నారు. ప్రభుత్వం మరోమారు ఈ నిర్ణయాన్ని దయ చేసి పున:సమీక్షించుకోవాలని విన్నవించారు.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తర్వాత నుంచి వైఎస్సార్సీపీతో అంట కాగుతున్నారు. ఈ క్రమంలో పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జగన్ ప్రభుత్వం పేరు మార్చడాన్ని తాను హర్షించడం లేదని వల్లభనేని వంశీ కుండబద్దలు కొట్టారు. “ఎన్టీఆర్ చొరవతో ఏర్పాటైన హెల్త్ యూనివర్శిటీకి కారణమైన ఆ మహానుభావుడి పేరును అదే జిల్లాలో కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను” అని వంశీ ట్వీట్ చేశారు.
అలాగే మరో ట్వీట్‌లో, "గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహనరెడ్డి గారు..మీరు ఎంతో పెద్ద మనసుతో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన నందమూరి తారకరామారావు గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వని గుర్తింపునిచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారు "
అని వంశీ పేర్కొన్నారు.
కాగా వల్లభనేని వంశీమోహన్ చేసిన ఈ ట్వీట్ ఆయన అధికారిక ఖాతా నుంచి వేసింది కాదని చెబుతున్నారు. కొంతమంది అది వల్లభనేని వంశీ ట్విట్టర్ ఖాతానేనని.. దాన్ని ఆయన వెరిఫై చేయించుకోలేదని అంటున్నారు.
కాగా వైఎస్ జగన్ నిర్ణయంలో వైఎస్సార్సీపీలోని కమ్మ సామాజికవర్గానికి చెందినవారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశం మరింత తీవ్రమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.