Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఎక్స్ పైరీ అయిపోయాడు .. తెలుగు తమ్ముళ్లూ ఆలోచించుకోండి.. వల్లభనేని వంశీ
By: Tupaki Desk | 8 April 2021 7:21 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. పరిషత్ ఎన్నికల పై చంద్రబాబు వ్యాఖ్యలను వంశీ తప్పుబట్టారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఏడవలేక మద్దెల దరువు అన్న చందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ముఖ్యమైంది.. చంద్రబాబు పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయం కాదు అని అన్నారు. అతి త్వరలోనే టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమని, దీని గురించి తెలుగు తమ్ముళ్లు ఆలోచించుకోవాలి అన్నారు. పంచాయతీల్లో 40 శాతం ఓట్లు వచ్చాయని టపాసులు కాల్చిన తండ్రి, కొడుకులు ఎందుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎక్స్పైరీ అయిపోయాడని అన్నారు.
టీడీపీలో లోకేష్ గుది బండలాంటి వాడని సెటైర్లు వేశారు. తెలంగాణాలో ఓటుకు నోటు విచారణ వస్తుందని.. టీడీపీని టీఆర్ ఎస్ లో విలీనం చేశారన్నారు. ఓటుకు నోటు కేసుకు భయపడి 2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాద్ లో హక్కు ఉన్న పారిపోయి వచ్చారన్నారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మంత్రి కావాలని చూసి రాష్టంలోనే చతికిల పడ్డారన్నారు. అప్పుడు కేంద్రానికి దడిచి టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో సిగ్గులేకుండా విలీనం చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో అందించలేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్ పేద ప్రజలకు అందిస్తున్నారని, ప్రచారం సమయంలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని.. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు అండగా ఉన్నారన్నారు. 2019 ఎన్నికల సమయంలో 10వేలు కోట్ల రూపాయలు ఆడపడుచులకు ఇచ్చి మోసం చేయాలని చంద్రబాబు చూస్తే, అదే రూ.10 వేలు కోట్లతో సీఎం జగన్ ఆడపడుచులకు సొంతింటి కల నెరవేర్చాన్నారు. టీడీపీ త్వరలోనే కనుమరుగైపోతుంది అని ఇప్పటికైనా తెలుగు తమ్ముళ్లు ఆలోచించుకోవాలని అన్నారు.