Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత!
By: Tupaki Desk | 22 Jun 2022 5:23 AM GMTగన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఎడమ చేయి విపరీతంగా లాగుతుందని ఆయన చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న ఒక ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఈసీజీ, 2డి ఎకో, యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వల్లభనేని వంశీని అబ్జర్వేషన్ లో ఉంచారు. ఒకటి, రెండు రోజుల్లో వంశీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా వల్లభనేని వంశీ.. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) హైదరాబాద్‌లో అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు చదువుతున్నారు. గతేడాది ఆయన ఇందులో సీటు సాధించారు. అయితే.. ఇండియన్ బిజినెస్ స్కూల్ హైదరాబాద్ క్యాంపస్ లో కాకుండా పంజాబ్ లోని మొహాలి క్యాంపస్ లో ఆయన చదువుతున్నారు.
ప్రస్తుతం మొహాలి క్యాంపస్ లో జరుగుతున్న ప్రత్యక్ష తరగతులకు ఆయన హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 21న తనకు చేయి లాగడంతోపాటు గుండెలో కొంచెం అలజడిగా ఉందని చెప్పడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కాగా, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీమోహన్ ఆ తర్వాత వైఎస్సార్సీపీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి.
వంశీ తల తెచ్చినవారికి 50 లక్షల రూపాయలు ఇస్తానని ఖమ్మంకు చెందిన ఒక కమ్మ సామాజికవర్గం నేత ప్రకటించడం కలకలం రేపింది. ఆ తర్వాత తన వ్యాఖ్యల పట్ల వంశీ విచారం కూడా వ్యక్తం చేశారు. ఇటీవల మళ్లీ నారా లోకేష్ పదో తరగతి విద్యార్థులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లోకి వల్లభనేని వంశీ, కొడాలి నాని రావడం తీవ్ర వివాదాస్పదమైంది.