Begin typing your search above and press return to search.

ఆమెకు 69 మంది పిల్లలు...

By:  Tupaki Desk   |   30 April 2016 11:00 PM IST
ఆమెకు 69 మంది పిల్లలు...
X
షాకవ్వకండి.. మీరు చదువుతున్నది నిజమే. అవును.. ఒకే మహిళ 69 మంది పిల్లలను కన్నది. ప్రపంచంలో అత్యధికమంది పిల్లలను కన్న మహిళగా ఆమె రికార్డులకెక్కింది. 30 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పిల్లలను కన్న ఆమె పేరు వాలంటీనా వసిల్యేవ్.... ఫియోడర్ వసిల్యేవ్ అనే రష్యన్ కు మొదటి భార్య అయిన ఆమె తన జీవితకాలమంతా పిల్లలను కంటూనే ఉందట. అంతేకాదు... కాన్పుకు ఒకరు ఇద్దరిని కాకుండా కొన్నికొన్నిసార్లు ముగ్గురు - నలుగురు పిల్లలనూ కనడంతో ఆమె రికార్డు స్థాయిలో 69 మందికి జన్మనివ్వగలిగింది.

16సార్లు కవల పిల్లలకు... ఏడుసార్లు ముగ్గురేసి పిల్లలకు.... నాలుగు సార్లు ఒకే కాన్పులో నలుగురేసి పిల్లలకు జన్మనిచ్చిందట ఆమె. దాంతో మొత్తం 27 కాన్పుల్లోనే 69 మందిని కనడం ఆమెకు సాధ్యమైంది.1707-82 మధ్య జీవించిన ఫియోడర్ వసిల్యేవ్ కు వేలంటినాతో జన్మించిన 69 మందిలో 67 మంది బతకగా ఇద్దరు మాత్రం చిన్నతనంలోనే మరణించారట.

ప్రపంచంలో అత్యధిక మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళలు...

వేలంటినా వసిల్యేవ్ 69

గ్రావటా 62

యాకోవ్ కిరిలోవ్ 57

బార్బరా 53

మేడిలీనా గ్రానటా 52

ఎలిజబెత్ 42

అలీస్ హూక్సు 41

ఎలిజబెత్ గ్రీన్ హిల్ 39