Begin typing your search above and press return to search.
వైష్ణోదేవి ఆలయం ఎవరికి తెలియని చరిత్ర..!
By: Tupaki Desk | 2 Jan 2022 3:01 PM ISTనూతన సంవత్సరం వేళ గుడిలో తొక్కిసలాట జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. కొత్త సంవత్సరం అంతా శుభం జరగాలని కోరుకుంటూ ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి వేకువజాము నుంచి పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. కానీ అంతలోనే ఊహించని దుర్ఘటనలో అనంతలోకాలకు చేరారు. అయితే ఈ దేవాలయంలో ఎందుకంత రద్దీ నెలకొంది? అసలు ఆ గుడి స్పెషాలిటీ ఏంటి అనే దానిపై స్పెషల్ స్టోరీ...
జమ్ముకశ్మీర్ లోని ప్రాచీన దేవాలయం వైష్ణోదేవీ. సరస్వతీ, లక్ష్మీ అమ్మవారి కలిసి ఇక్కడ ఆవిర్భవించిన ట్లు చరిత్రకారులు చెబుతారు. ఋగ్వేదానికి చెందిన ఈ ఆలయంలో దుర్గాదేవి స్వయంభువుగా వెలిసింది. రాక్షస సంహారం తర్వాత ఆ దేవి ఇక్కడ వెలిసిందని... రాక్షసుడు తల గుహ నుంచి పక్కనే లోయలోకి పడిపోయిందని చెబుతారు. చాలా మహిమగల ఆలయం అని అక్కడివారు నమ్ముతుంటారు. శ్రీకృష్ణుడు సూచన మేరకు పాండవులు కూడా ఈ అమ్మవారిని దర్శించుకున్నారని... అనంతరం కౌరవులపై విజయం సాధించారని విశ్వసిస్తుంటారు.
కాట్రా సమీపంలో సముద్రమట్టానికి 5,300 అడుగుల ఎత్తున ఈ త్రికూట ఆలయం ఉంటుంది. చుట్టూ పర్వతాలు నడిమధ్యలో అమ్మవారు కొలువై ఉంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయానికి ఏటా పది మిలియన్ల మంది దాకా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మార్చి నుంచి అక్టోబర్ మధ్యలో ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శనం కోసం తరలి వస్తారు. దేశంలో శ్రీవేంకటేశ్వరుని సన్నిధి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత... అత్యధిక మంది భక్తులు వచ్చే ఆలయంలో రెండో స్థానంలో నిలిచింది ఈ పవిత్ర పుణ్యస్థలం. అందుకే నాటి నుంచి నేటి దాకా దేదీప్యమానంగా విరాజిల్లుతోంది.
ఇంతటి మహిమ గల అమ్మవారి దర్శనం అంత సాదాసీదాగా జరగదు. తొలుత కాట్రా కు చేరుకొని... అక్కడ దర్శనం కోసం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జమ్మూ నుంచి 42 కిలోమీటర్ల దూరం ఉన్న కాట్రా కు సమీపంలో ఓ విమానాశ్రయం కూడా ఉంటుంది. వివిధ నగరాల నుంచి కనెక్టివిటీ ఉంటుంది. ఈ విధంగా విమానం, రైలు, రోడ్డు మార్గాల ద్వారా కాట్రా చేరవచ్చు. ఇక కాట్రా లో టికెట్ తీసుకుని దర్శనానికి బయల్దేరాలి. గుహల్లో చాలా దూరం నడవాలి. ప్రధాన ఆలయం ఉన్న గుహ 30 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ విధంగా గుహల్లో నడుస్తూ అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ ఆలయం ఏడాది అంతా కూడా తెరిచే ఉంటుంది.
మన దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ప్రాచీన కట్టడాలకు నెలవుగా ఉన్న భారత్ లో ఈ వైష్ణోదేవి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. అందుకే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అమ్మవారి దర్శనం కోసం జనం పోటెత్తారు. ఈ నేపథ్యంలో యువకుల మధ్య చిన్న ఘర్షణ తలెత్తింది. క్రమంగా అది తొక్కిసలాటకు దారి తీసింది. ఈ దుర్ఘటనలో 12మంది మృతి చెందారు. మరో 15 మంది గాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు... పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.