Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ ఇప్పట్లో రానట్టే.. క్లినికల్ ట్రయల్స్​కు బ్రేక్​!

By:  Tupaki Desk   |   27 Oct 2020 11:30 AM IST
వ్యాక్సిన్ ఇప్పట్లో రానట్టే.. క్లినికల్ ట్రయల్స్​కు బ్రేక్​!
X
కరోనా వైరస్‌ వ్యాక్సిన్​ తయారుచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. భారత్ సహా అనేక దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికాలో చేపట్టిన యాంటీబాడీ డ్రగ్ ట్రయల్స్ విఫలం అయ్యాయి. ఆ డ్రగ్ వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని పరిశోధకలు తేల్చిచెప్పారు. దీంతో క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేశారు. క్లినికల్​ ట్రయల్స్​కు బ్రేక్​ పడటంతో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఎలీ లిల్లీ అనే అమెరికన్ ఫార్మాసూటికల్స్ సంస్థ ఈ యాంటీబాడీ డ్రగ్‌ను రూపొందించింది. ఈ సంస్థ 18 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి. రెండు వారాల నుంచీ దీనిపై ట్రయల్స్ నిర్వహిస్తోంది.

అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ దీన్ని పర్యవేక్షిస్తోంది. ఈ రెండు వారాల వ్యవధిలో ఈ డ్రగ్ వల్ల ఎలాంటి మెరుగైన ఫలితాలు రాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇలాంటి యాంటీబాడీ డ్రగ్స్‌ ద్వారానే చికిత్స అందించడం, అది ఫలితాన్ని ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. న్యూయార్క్‌కు చెందిన రీజెనెరాన్ ఫార్మాసూటికల్స్ సంస్థ రూపొందించిన యాంటీబాడీ డ్రగ్‌ ద్వారా డొనాల్డ్ ట్రంప్‌కు చికిత్స అందించారు. అది కొంతమేర సానుకూల ప్రభావం చూపిందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ పేర్కొంది. కెనడియన్ కంపెనీ యాబ్‌సెల్లెరాతో కలిసి అభివృద్ధి చేసిన డ్రగ్‌పై తాము ప్రత్యేకంగా ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ఎలీ లిల్లీ సంస్థ వెల్లడించింది.