Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఫ్రీ గా వ్యాక్సిన్ .. !
By: Tupaki Desk | 22 Oct 2020 6:00 PM ISTబీహార్ లో అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో అన్ని ప్రధాన పార్టీలతో పాటుగా ప్రాంతీయ , చిన్న పార్టీలు కూడా ఎన్నికల ప్రచారంలో జోరు పెంచుతున్నాయి. పలు అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకొని ప్రచారంలో ముందుకుసాగుతున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులో ఉన్న ఓ వాగ్దానం గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. అదేమిటంటే ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్. ప్రపంచాన్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న కరోనా మహమ్మారికి టీకా ఎప్పుడు వస్తుందో ఇంకా స్పష్టమైన విషయం ఎవరికీ తెలియదు.
ఈ నేపథ్యంలో సమయంలో బీహార్ లో బీజేపీ ప్రభుత్వం తాము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ ప్రకటించడంతో ఈ విషయం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. పాట్నాలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బీహార్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత.. బీహార్ లో ప్రతి ఒక పౌరుడికి ఉచితంగా టీకా ఇవ్వనున్నట్లు మంత్రి సీతారామన్ చెప్పారు. మా ఎన్నికల మ్యానిఫెస్టోలో మేం చేసిన తొలి వాగ్ధానం ఇదే అని మంత్రి చెప్పారు. ఎన్డీఏకు ఓటేయాలని.. మరో అయిదేళ్ల పాటు నితీశ్ కుమార్ సీఎంగా ఉంటారన్నారు. ఆయన పాలనలోనే బీహార్ ఉత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
బీహార్ రాష్ట్ర ప్రజలు రాజకీయంగా చాలా సున్నితంగా ఉంటారని, వారికి రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కువే అన్నారు. పార్టీలు చేసే వాగ్ధాలను వారు అర్థం చేసుకుంటారని ఆమె అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం హయంలో.. బీహార్‌లో జీడీపీ బాగా పెరిగిందన్నారు. 3 శాతం నుంచి 11.3 శాతానికి గత 15 ఏళ్ల ఎన్డీఏ పాలనలో పెరిగినట్లు ఆమె వెల్లడించారు. ప్రజలకు సుపరిపాలన అందించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.