Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్​ లో వ్యాక్సిన్​ పంపిణీ షూరు..! తొలి వ్యాక్సిన్​ ప్రధానికే

By:  Tupaki Desk   |   20 Dec 2020 1:20 PM IST
ఇజ్రాయెల్​ లో వ్యాక్సిన్​ పంపిణీ షూరు..!  తొలి వ్యాక్సిన్​ ప్రధానికే
X
ప్రపంచాన్ని గడగలాడించిన కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన కంపెనీ తయారుచేసిన ఫైజర్​ వ్యాక్సిన్​ ప్రభావవంతంగా పనిచేస్తోంది. ఇప్పటికే బ్రిటన్​ లో ఫైజర్​వ్యాక్సిన్​ పంపిణీని ప్రారంభించారు. ఇటీవల అమెరికాలోనూ వ్యాక్సినేషన్​ కు అనుమతి ఇచ్చారు. తాజాగా ఇజ్రాయేల్​లో ఫైజర్​ వ్యాక్సినేషన్​ ప్రారంభించారు. తొలి వ్యాక్సిన్​ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఇచ్చారు. ఇజ్రాయేల్​ రాజధాని టెల్ అవివ్ సమీపంలోని రమత్ గాన్‌ లోని షెబా మెడికల్ సెంటర్‌ లో ఆయనకు ఇంజెక్షన్​ ఇచ్చారు.

అయితే ఈ కార్యక్రమాన్ని ఇజ్రాయెల్​ ప్రభుత్వ అధికారిక మీడియాలో లైవ్​ టెలికాస్ట్​ చేశారు. వ్యాక్సిన్​ పట్ల ప్రజలకు ఉనన అపోహలు తొలగించేందుకు తొలి వ్యాక్సిన్​ ను ప్రధానికి ఇచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ప్రజలు వ్యాక్సిన్​ను వేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలు సహకరించాలని వాళ్లు పిలుపునిచ్చారు. ఇజ్రాయేల్​ ఆరోగ్యశాఖ మంత్రి యులి ఎడెల్‌స్టెయిన్‌ కూడా వ్యాక్సిన్​ తీసుకున్నారు. అమెరికా - బ్రిటన్​తో పాటు కెనడా - సౌదీ అరెబియా కూడా ఫైజర్​ వ్యాక్సిన్​ కు అనుమతి ఇచ్చాయి.

ఆయా దేశాల్లో త్వరలో వ్యాక్సినేషన్​ ప్రారంభం కానున్నది. ఆ వ్యాక్సిన్​ ను ఫైజర్-బయోఎన్‌ టెక్ తయారు చేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయేల్​ లో ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్​ ప్రారంభించే అవకాశం ఉన్నది. తొలిదశలో ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సిన్​ ఇవ్వనున్నారు. ఆ తర్వాత 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులకు వ్యాక్సిన్​ ఇవ్వనున్నారు. ఇజ్రాయేల్​ ఎనిమిది మిలియన్​ డోసుల వ్యాక్సిన్​ కోసం ఆర్డర్లు ఇచ్చింది. ఫైజర్​ వ్యాక్సిన్​ రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. అన్నిదేశాలు వ్యాక్సినేషన్​ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ పూర్తికాగా..కొన్ని దేశాల్లో త్వరలో వ్యాక్సినేషన్​ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.