Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్​ భారం సంపన్నులపైనే..! నిర్మలమ్మ ఎత్తులు..!

By:  Tupaki Desk   |   12 Jan 2021 12:15 PM IST
వ్యాక్సిన్​ భారం సంపన్నులపైనే..!  నిర్మలమ్మ ఎత్తులు..!
X
కరోనా ఎఫెక్ట్​తో అన్నిదేశాలు ఆర్థికంగా కుంగిపోయాయి. మనదేశం కూడా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్​ త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే కోవిషీల్డ్​, కోవాగ్జిన్​ అత్యవసర పంపిణీకి అనుమతులు వచ్చేశాయి. ఈ క్రమంలో ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్​ మరింత భారం కానున్నది. అయితే ఈ వ్యాక్సినేషన్​ భారాన్ని సంపన్నులమీద, కంపెనీల మీద వేయాలని ఆర్థికశాఖ యోచిస్తున్నదట.

ఇందుకోసం వ్యాక్సిన్​ సెస్​ వేయాలని ప్రణాళికలు రచిస్తున్నదట. ఫిబ్రవరి 1న బడ్జెట్​ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్​కు ముందే సంపన్నులపై వ్యాక్సిన్​ సెస్​ వేయాలని కేంద్రం యోచిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్​ కోసం (లాజిస్టిక్ ఖర్చులు సహా) రూ.60,000-65,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేంద్రం యోచిస్తున్నది. అయితే ఈ మొత్తాన్ని సంపన్నుల మీద మోపాలని కేంద్రం యోచిస్తున్నదట. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఇప్పటికే పలు కంపెనీలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

కరోనా ఎఫెక్ట్​తో బిజినెస్​ నడవక ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా సెస్​ వేయడం సరికాదని వాళ్లు అంటున్నారట. అయితే కేంద్రం ముందు ప్రస్తుతం మరో మార్గం లేదు. వ్యాక్సినేషన్​ కొనసాగించాలంటే పన్ను విధించాల్సిందే. అయితే కరోనా ఎఫెక్ట్​తో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలు కేంద్రం నిర్ణయాన్ని ఎలా తీసుకుంటాయో వేచి చూడాలి. మరోవైపు ఇంధనం పై కూడా పన్ను విధించాలని కేంద్రం యోచిస్తున్నదట.