Begin typing your search above and press return to search.

మోడీకి వ్యాక్సినేషన్ ఇక పెద్ద సవాలే

By:  Tupaki Desk   |   23 May 2021 2:30 PM GMT
మోడీకి వ్యాక్సినేషన్ ఇక పెద్ద సవాలే
X
దేశంలోని మెజార్టీ రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ పెట్టడంతో కరోనా తీవ్రత తగ్గుతోంది. రోజుకు రెండున్నర లక్షలకు కేసులు తగ్గాయి. మే నెలాఖరు వరకు రోజువారీ కేసులు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా వేగంగా తగ్గుతోంది. ప్రస్తుతం 29 లక్షల యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి.

దేశంలో సెకండ్ వేవ్ తో అల్లాడిన రాష్ట్రాలు మహారాష్ట్ర, ఢిల్లీలు కోలుకుంటున్నాయి. ఇక్కడ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.కర్ణాటకలో సైతం తగ్గుతున్నాయి. రాబోయే రెండు నెలల్లో దేశానికి కరోనా నుంచి ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే సెకండ్ వేవ్ తగ్గినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరో కత్తి వేలాడుతోంది. ఈ కరోనా భయానికి అందరిలో ప్రాణభయం వచ్చేసింది. ఇప్పుడు అందరూ వ్యాక్సిన్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈ సెకండ్ వేవ్ ముగిశాక వ్యాక్సినేషన్ ఒత్తిడి పతాక స్థాయికి చేరేలా ఉంది.

ఇప్పటికే బయట ఒక డోస్ వేసుకున్న వారికి రెండో డోస్ వేసుకోవడానికి వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇక 18-45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించి మరీ వ్యాక్సిన్ల కొరతతో అందించలేని పరిస్థితి ఏర్పడింది.

వ్యాక్సిన్ వేసుకుంటే కరోనాను జయించే విషయంలో కొంత ధీమాగా ఉండొచ్చని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీంతో ఇప్పుడు వ్యాక్సిన్ల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. ప్రభుత్వాలు ఎప్పుడు ఇస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.

వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ల పంపిణీ కేంద్రం చేతుల్లో ఉండడంతో ఇప్పుడు అందరూ ప్రధాని మోడీ వైపే వేలెత్తి చూపుతున్నారు. మోడీ విధానాలతోనే దేశంలో వ్యాక్సిన్ల కొరత వచ్చిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మూడో వేవ్ వచ్చే లోపు ప్రజలకు వ్యాక్సిన్లు అందివ్వకపోతే మోడీ సర్కార్ పై మరోసారి అపవాదు రావడం ఖాయంగా కనిపిస్తోంది.