Begin typing your search above and press return to search.

అయ్యన్న అరెస్ట్ తప్పదట ...ఎవరన్నారంటే !

By:  Tupaki Desk   |   21 Jun 2020 4:01 PM IST
అయ్యన్న అరెస్ట్ తప్పదట ...ఎవరన్నారంటే !
X
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం వరుసగా ఏపీలో టీడీపీ కీలక నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే కూడా సీనియర్ లీడర్ అయిన అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన అరెస్ట్ అనివార్యమని కూడా అంటున్నారు. ఇప్పటికే అయ్యన్న పాత్రుడు మీద నిర్భయ కేసు నమోదు అయింది. దీని మీద అయ్యన్న హైకోర్టు కు వెళ్లారు. తన మీద అక్రమంగా కేసు నమోదు చేశారని అయ్యన్న వాదనలు వినిపిస్తున్నారు.

అయితే , ఏదిఏమైనా ... అయ్యన్నను తప్పకుండా అరెస్ట్ చేసి తీరుతామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అంటున్నారు. అయ్యన్న నర్శీపట్నం మహిళా కమిషనర్ మీద అసభ్య పదజాలంతో దూషించిన మాటలు అన్నీ ఆడియో, వీడియో ద్వారా రికార్డు అయి ఆధారాలతో సహా ఉన్నాయని ఆమె అంటున్నారు. తాము వాటిని చూసిన మీదట సుమోటోగా కేసును టేకప్ చేస్తామని చెబుతున్నారు. ఒక మహిళా కమిషనర్ని అయ్యన్న లాంటి వారు దూషిస్తే చంద్రబాబు ఆయనకు మద్దతుగా రావడం దారుణమని వాసిరెడ్డి మండి పడుతున్నారు.

కేవలం 23 సీట్లతో రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన పార్టీ నాయకుడే ఇలా అహంకారంతో రెచ్చిపోతే మీ పాలనలో మహిళలకు ఎంత విలువ ఇచ్చారో అంతా చూశారని కూడా వాసి రెడ్డి అంటున్నారు. మహిళలు అంటే టీడీపీ కి అంత చులకన గా ఉందా, వారు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవద్దా, వారి మీద దౌర్జన్యాలు చేస్తారా అంటూ ఆమె టీడీపీ పెద్దల మీద ఒక రేంజి లో వేసుకున్నారు. అయ్యన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయగలరా అని ఆమె బాబుని సవాల్ చేశారు. తప్పు చేసిన మొత్తానికి అయ్యన్న అరెస్ట్ తప్పదని ఆమె పక్కా క్లారిటీగా చెప్పేశారు.