Begin typing your search above and press return to search.

ఫలితాలపై వీహెచ్ మార్కు కామెడీ.. వీళ్లు మారరు!

By:  Tupaki Desk   |   11 Dec 2018 12:16 PM IST
ఫలితాలపై వీహెచ్ మార్కు కామెడీ.. వీళ్లు మారరు!
X
విజయం మీద చాలా గట్టి విశ్వాసంతో కనిపించారు కాంగ్రెస్ నేతలు. అయితే.. కౌంటింగ్ లో మాత్రం వారి అంచనాలు తల కిందుల అయ్యాయి.

కనీసం హంగ్ అని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో సాధించినన్ని సీట్లను కూడా సాధించలేకపోయింది. కాంగ్రెస్ హేమాహేమీలు గత ఎన్నికల్లో నెగ్గి పరువు నిలబెట్టుకోగా..ఈ సారి వాళ్లు కూడా ఓటమి బాట పడుతూ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతల స్పందనలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన ఓటమే నిజం అయితే..దాన్ని అంగీకరిస్తానని ఆయన అన్నాడు. రేవంత్ హుందాగానే స్పందించాడని అనుకోవాలి.

అయితే ఇలాంటి సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తన దైన కామెడీ చేశాడు. ఈవీఎంలు టాంపరింగ్ అయ్యాయని అంటున్నాడు. అందుకే తెరాస నెగ్గిందని అయన చెప్పుకొచ్చాడు. ఇలాంటి మాటలతోనూ, ఇలాంటి నేతల వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా తయారైంది. వీహెచ్ మాటలు విన్న విశ్లేషకులు .. కాంగ్రెస్ లో చాలా మార్పులే రావాల్సి ఉందని అంటున్నారు. టాంపరింగ్ నిజమేఅయితే.. రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా నెగ్గినట్టు అని వారు ప్రశ్నిస్తున్నారు.